calender_icon.png 3 August, 2025 | 1:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకు ఖాతాలో నుండి డబ్బు మాయం

02-08-2025 10:40:56 PM

దౌల్తాబాద్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం సయ్యద్ నగర్ లో  ఓ మహిళ బ్యాంకు ఖాతా నుంచి నగదు మాయమైంది. సయ్యద్ నగర్ గ్రామానికి చెందిన అలీ బిబి ఖాతాలో రూ.2.39 లక్షల నగదును సైబర్ నేరగాళ్లు మాయం చేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్ల్తే సయ్యద్ నగర్ కు చెందిన అలీ బిబి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది. భర్త అలీ హుస్సేన్ దుబాయిలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. వీరికి ఒక కొడుకు అజ్ముద్దీన్ ఉన్నాడు. దుబాయ్ లో ఉన్న అలీ హుస్సేన్ అక్కడ పని చేస్తూ డబ్బులను భార్య అలీ బీబీ ఖాతాలో జమ చేసేవాడు.

ఇరువురి బ్యాంక్ ఖాతాలకు అజ్ముద్దీన్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండగా ఫోన్ పే,గూగుల్ పే ద్వారా ఇంటి అవసరాలకు వాడుతునేవాడు.రెండు రోజుల క్రితం అజ్ముద్దీన్ ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు చూస్తూ ఉండగా ఒక వీడియోలో డ్రోన్ కెమెరా అమ్మబడును అని క్రింద ఫోన్ నెంబర్ రాసి ఉంది. అతడు ఆ నెంబర్ కి ఫోన్ చేసి డ్రోన్ కెమెరా కావాలని అడగడంతో ఆ వ్యక్తి డబ్బులు పంపితే కెమెరా పంపిస్తామని చెప్పాడు. దీంతో అజ్ముద్దీన్ రూ. 50 వేలు పంపాడు. రెండు రోజులు జూలై 31,అగస్టు1 తేదీలలో పలుమార్లు ఫోన్ పే ద్వారా పంపుతూ రూ.2లక్షల 39 వేల వరకు పోగొట్టుకున్నారు. ఖాతా మొత్తం ఖాళీ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న అజుముద్దీన్ మామ అబ్జర్ శనివారం రాయపోల్ ఎస్సై మానస సంప్రదించి ఫిర్యాదు చేశాడు. ఎస్సై కేసు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.