28-07-2025 12:00:00 AM
రూ. కోటి అంచనా వ్యయంతో నిర్మాణం
కోహీర్, జూలై 27 : సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బడంపేట శ్రీ రాచన్న స్వామి ఆలయ ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రూ. కోటి అంచనా వ్యయంతో చేపట్టనున్న ఏడంతస్తుల గోపుర నిర్మాణానికి కాశీ పీఠాధిపతి జగద్గురు డాక్టర్ చంద్ర శేఖర శివాచార్య భూమి పూజ చేశారు. అంతకుముందు నిర్వహించిన కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి విభూతి శివరుద్రప్ప, ఆలయ పాలక మండలి సభ్యులు, అర్చక బృందం సభ్యులు శివాచార్య స్వామివారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
శివాచార్య స్వామి భద్రకాళీ సమేత వీరభద్ర స్వరూపులైన శ్రీ రాచన్న స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న లక్ష బిల్వార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తంగేడుపల్లి మఠం పీఠాధిపతి శివయోగి శివాచార్య, ధనసిరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్య, మాజీ ఆలయ కమిటీ చర్మెన్లు రాజు స్వామి, సోమలింగం, నాయకులు రామలింగారెడ్డి, హనుమంతరావు పాటిల్, శివమూర్తి స్వామి పాల్గొన్నారు.