28-07-2025 12:00:00 AM
ఎగువ నుంచి వస్తున్న నీరు.. నిండుకుండలా ప్రాజెక్టు
కామారెడ్డి, జూలై 27 (విజయ క్రాంతి) : నాలుగు రోజులుగా జిల్లా లో కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం కళ్యాణి ప్రాజెక్టు లోకి వరద నీరు వచ్చి చేరింది. నిండుకుండలా మారడంతో రెండు గేట్లను ఆదివారం ప్రాజెక్టు అధికారులు ఎత్తివేశారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు నిండడంతో రెండు గేట్లను ఎత్తివేసినట్లు అధికారులు తెలిపారు.
పై నుంచి వస్తున్న వరద నీటితో సమానంగా ప్రాజెక్టు గేట్లను ఎత్తి అదే మోతాదులో నీటిని వదులుతున్నట్లు తెలిపారు. 330 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.