calender_icon.png 13 September, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హత లేని వారితో గ్రూప్-1 పేపర్లు దిద్దించారు

13-09-2025 03:41:11 AM

  1. గ్రూప్-1 అవక తవకలపై సమగ్ర విచారణ జరిపించాలి
  2. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

ముషీరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): గ్రూప్-1 అవక తవకలపై సమగ్ర విచారణ జరిపించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. సమర్థులు కాకుండా దొడ్డి దారిన వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తే పాలన కుప్పకూలి పోతుందన్నా రు. ఈ మేరకు శుక్రవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడారు. అర్హత లేని వారితో గ్రూప్-1 పేపర్లు దిద్దించారని అన్నారు. ఫలితాలు పరిశీలిస్తే తెలుగు మీడి యం వారికి తీవ్ర అన్యాయం జరిగినట్లు స్పష్టమవుతుందని తెలిపారు.

తెలంగాణలో 12,381 మంది ఇంగ్లీషులో హాజరైతే 506 మంది ఎంపికయ్యారని తెలిపారు. అలాగే తెలుగులో 8,694 మంది హాజరైతే 56 ఎంపికయ్యారని చెప్పారు. ఉర్దూలో 10 మందికి ఒకరు మాత్రమే ఎంపిక అయ్యారని తెలిపారు. మహిళా అభ్యర్థులను 28 కేంద్రాల్లో కేటాయించగా కోఠి ఉమెన్స్ కాలేజీలోని రెండు సెంటర్లలో 71 మంది ఎంపి కయ్యారని, మిగిలిన 26 సెంటర్లలో 139 మంది మాత్రమే ఎంపికయ్యారని తెలిపారు. 719 మందికి ఒకే మార్కులు రావడం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు.

తెలంగాణ ఉద్య మం కొందరు ఒక్క పేజీలో, మరి కొందరు 10 పేజీల్లో రాస్తే ఒకే రకమైన మార్కులు ఎలా వస్తాయన్న ప్రశ్నకు కమిషన్ నుంచి సమాధానం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయలేదని, కొత్తగా జీవో 29 తెచ్చి తీవ్ర అన్యాయం చేశారన్నారు. ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లకుండా వెంటనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని అన్నారు. సంఘం జాతీయ కన్వినర్ గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్, దోర్నాల కొండల్, నందగోపాల్, వేముల రామకృష్ణ, జక్కుల వంశీ కృష్ణ, పగిళ్ల సతీష్, మోడీ రామ్ దేవ్, పి.యాదగిరి, చంద్రమౌళి, విష్ణు చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.