calender_icon.png 13 October, 2025 | 3:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో వేడెక్కిన గ్రూపు రాజకీయాలు

13-10-2025 12:00:00 AM

- ఎవరికి వారు ముఖాముఖి కార్యక్రమాలు 

- అయోమయంలో పార్టీ శ్రేణులు 

- డిసిసి అధ్యక్ష పదవి కోసం పోటాపోటీ

మేడ్చల్, అక్టోబర్ 12(విజయ క్రాంతి): డిసిసి అధ్యక్ష పదవి ఎన్నికల సమయంలో మేడ్చల్ జిల్లాలో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. అధ్యక్ష పదవిని పలువురు నాయకులు ఆశిస్తున్నారు. అనుబంధ సంఘాల అధ్యక్షులు, మండల, మున్సిపల్, కార్పొరేషన్ లో అధ్యక్షులు, ఇతర ముఖ్య నాయకుల అభిప్రాయాలు తీసుకోవడానికి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఏఐసీసీ, పీసీసీ పరిశీలి కలుగా నియామకమైన వారు అభిప్రా యాలు తీసుకుంటున్నారు. ఏఐసీసీ పరిశీల కు రాలిగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఎమ్మె ల్యే అంజలి నిమ్బాల్కర్, పిసిసి పరిశీలకు లుగా ఎంపీ బలరాం నాయక్, పటేల్ రమేష్ రెడ్డి, నందిమల్ల యాదయ్య ముదిరాజ్, ఇందిరా నియామకమయ్యారు. ఏఐసీసీ, పీసీసీ పరిశీలకులు శనివారం మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు.

ఈ సమావేశానికి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఆదివారం మళ్లీ డిసిసి అధ్యక్ష పదవి విషయమై ఏఐసీసీ పరిశీలకురాలు అంజలి నిమ్బల్కర్, ఎంపీ బలరాం నాయక్ , యాదయ్య ముదిరాజ్  ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. డిసిసి అధ్యక్ష పదవి కోసం ముఖాముఖి కార్యక్రమం నిర్వహించినందున జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నాయకులను ఆహ్వానించాలి. కానీ చాలామందికి సమాచారం ఇవ్వలేదు.

నియోజకవర్గ ఇన్చార్జిలకు సైతం సమాచారం లేదు. మున్సిపల్, కార్పొరేషన్లు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది. సోమవారం మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జి వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో అంతయి పల్లి లోని ఒక ఫంక్షన్‌హాల్‌లో మేడ్చల్ నియోజకవర్గం ముఖాముఖి కార్యక్రమం జరుగనుంది. అలాగే మిగతా నియోజకవర్గంలో నూ ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

పార్టీ శ్రేణుల్లో అయోమయం 

మేడ్చల్ జిల్లా లో తాజా రాజకీయ పరిణామాలపై పార్టీ కార్యకర్తలు అయోమ యానికి, గందరగోళానికి గురవుతున్నారు. పార్టీలో ఏం జరుగుతుందో, ఏ సమావేశం ఎవరు నిర్వహిస్తున్నారు అర్థం కావడం లేదని నాయకులు అంటున్నారు. రాష్ర్టంలో ఎక్కడ లేని విధంగా జిల్లాలో అధ్యక్ష పదవి ఎన్నిక జరుగుతోందంటున్నారు. ఏఐసీసీ పరిశీలకురాలు, పిసిసి పరిశీలకులు అయోమయానికి తెరదించాలని జిల్లా నాయకులు కోరుతున్నారు. 

డిసిసి అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ 

డిసిసి అధ్యక్ష పదవికి తీవ్రపోటీ నెలకొంది. జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాల నుంచి పలువురు పోటీ పడుతున్నారు. ప్రస్తుత ఇన్చార్జి అధ్యక్షుడు హరి వర్ధన్ రెడ్డి మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికవుతారని భావించగా, అనూహ్యంగా పలువురు నాయకుల పేర్లు తెరమీదకు వచ్చాయి. పార్టీ అధికారంలో ఉన్నందున అధ్యక్ష పదవిపై పలువురు ఆసక్తి చూపుతున్నారు. కుతుబుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్, మేడ్చల్ నియోజకవర్గ ఇన్చార్జి వజ్రాస్ యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్, రాపోలు రాములు తదితరులు డిసిసి అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, జిహెఎంసి ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసే నాయకుడు అధ్యక్షుడు కావాలని సగటు  కార్యకర్త కోరుకుంటున్నాడు.