13-10-2025 12:00:00 AM
కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం
మిర్యాలగూడ, అక్టోబర్ 12 : బీసీలకు రాజకీయంగా సముచిత స్థానం కల్పించాలని ఉద్దేశంతో నిర్వహించిన కులగణన ప్రాతిపదికన అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదంతో ఆమోదించిన 42 శాతం రిజర్వేషన్స్ బీసీలకు దక్కే విధంగా రాష్ర్ట ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు.
ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్ లో పార్టీ రాష్ర్ట కమిటీ సభ్యులు డబ్బి కార్ మల్లేష్ సతీమణి సుమిత్ర భాయ్ సంతాప సభలో ఆయన పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసినందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసిందని కేంద్రంఅది అమలు కాకుండా అడ్డుకుంటుందని ఆరోపించారు.
బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత కోసం రాష్ర్ట ప్రభుత్వం దేశ సర్వో న్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడమే సరిపోదని అన్ని రకాలుగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడమే అది అమలుకు నోచుకుంటుందన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపు భారతదేశంలో అనేక సుంకాలు విధి స్తున్నారని, దీనిపై ప్రధాని మెతక వైఖరి అవలంబించడం సరికాదన్నారు.
అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశంలోకి దిగుమతి చేసేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నాడని అలా చేస్తే దేశంలో వ్యవసాయం కుంటు పడుతుందన్నారు. ట్రంపు విధించే సూకాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం పార్టీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు, మాసి ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ర్టంలో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారం కొరకు ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రస్తుత వాన కాలం సీజన్ లో ధాన్యం కొనుగోలుకు అవసరమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
రాష్ర్ట ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని అమలుపర్చి అరులైన వారందరికీ రాజకీయాలకతీతంగా సంక్షేమ అభివృద్ధి పథకాల అందించాలన్నారు. విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్ లో ప్రయోజనాలను వెంటనే మంజూరు చేయాలని గ్రామాలలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ర్ట కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ర్ట కమిటీ సభ్యులు నున్నా నాగేశ్వరరావు, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, డబ్బింగ్ మల్లేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హా సం, కందాల ప్రమీల, వీరేపల్లి వెంకటేశ్వర్లు, వన్ టౌన్ కార్యదర్శి డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రవి నాయక్, వినోద్ నాయక్, శశిధర్ రెడ్డి తదితరులు ఉన్నారు