calender_icon.png 20 September, 2025 | 2:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్న పిల్లలకు పౌష్టిక ఆహారంతో ఎదుగుదల

19-09-2025 11:54:37 PM

గరిడేపల్లి,(విజయక్రాంతి): పోషకాహార లోపంతో ఉన్న పిల్లలకు మంచి పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా పిల్లలు మంచి ఎదుగుదలతో ఆరోగ్యవంతంగా ఎదుగుతారని జిల్లా ఆస్పత్రికి చెందిన చిన్న పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ రాజ్ కుమార్ సూచించారు. గరిడేపల్లి లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన చిన్న పిల్లల వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంలో భాగంగా చిన్నపిల్లలకు వైద్య శిబిరాన్ని నిర్వహించినట్టు ఆయన తెలిపారు. శిబిరంలో 24 మంది చిన్న పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేయడం జరిగింది అన్నారు.

పోషకాహారం లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారికి ఏ విధమైన ఆహారం తీసుకోవాలనే విషయాలపై ఆయన తగిన సూచనలు చేశారు. హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉన్న వారికి ఐరన్ టాబ్లెట్స్ ను అందించారు. చిన్నపిల్లలకు తప్పనిసరిగా వ్యాధి నిరోధక టీకాలను క్రమం తప్పకుండా వేయించాలని కోరారు. గరిడేపల్లి వైద్యాధికారి వి.నరేష్ మాట్లాడుతూ... 30 సంవత్సరాల పైబడిన వారికి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు సంబంధించిన బిపి, షుగర్ పరీక్షలను నిర్వహించినట్లు తెలిపారు. చిన్నపిల్లలకు సరైన పౌష్టిక ఆహారం అందించడం ద్వారా వారిలో మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుందని తెలిపారు.పిల్లల్లో పోషకాహార లోపం లేకుండా చూసుకోవాలని కోరారు.