calender_icon.png 20 September, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆవిష్కర్తల అనుభవాలను చెబితేనే గుర్తింపు

20-09-2025 12:00:00 AM

-పత్రికా, టీవీ కథనాలతో ఊహించని స్థాయికి వ్యాపారాలు

-‘పిచ్ 2 ప్రెస్’ పేరిట జర్నలిస్టులతో ఇన్నోవేటర్ల సమావేశంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు

-పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : స్టార్టప్‌లు ఎక్కువగా ఇన్వెస్టర్లపైనే ఫోకస్ చేస్తుంటాయని, కానీ మీ అనుభవాలను ప్రపంచానికి చెబితేనే నిజమైన గుర్తింపు వస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సూచించారు. పత్రిక లేదా టీవీ కథనాలు మీ వ్యాపారాన్ని ఊహించని స్థాయికి తీసుకెళ్లగలదని తెలిపారు. ప్రపంచంలోనే తొలిసారిగా జర్నలిస్టుల ముందు నేరుగా ఇన్నోవేటర్లు తమ అనుభవాలను చెప్పుకునే అవకాశం ఇవ్వడంలో భాగంగా ‘పిచ్ 2 ప్రెస్’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం సచివాలయంలో డబ్ల్యూటీఐటీసీ ప్రెసిడెంట్ సందీప్ మక్తాలతో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఈ నెల 27న హైదరాబాదులోని ట్రైడెంట్ హోటల్‌లో జరుగనుం దని, స్టార్టప్‌లు, స్కేల్ అప్‌లు తమ కథలను ప్రపంచానికి చెప్పేందుకు ఈ వేదికను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తన స్వగ్రామ మైన మంథని నియోజకవర్గంలోని ధన్వాడ గ్రామం డిజిటల్ గ్రామంగా మారిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, డిజిథాన్ సంస్థ చేస్తున్న పనిని ప్రత్యేకంగా ప్రశంసించారు.

పిచ్ 2 ప్రెస్ ఈవెంట్‌లో దేశం నలుమూలల నుంచి 100 కంటే ఎక్కువ ఐటీ బీట్ జర్నలిస్టులు పాల్గొంటున్నారని పేర్కొన్నారు. సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ పిచ్ 2 ప్రెస్ ద్వారా ఇన్నోవేషన్‌కు గొంతుక ఇవ్వడం, మంచి అనుభవాల ద్వారా వ్యాపారాన్ని వేగంగా ఎదిగించడమే తమ లక్ష్యమన్నారు. జర్నలిస్టులు, ఇన్నోవేటర్లు ఇద్దరూ తప్పక ఈ ప్లాట్ ఫామును ఉపయోగించుకోవావిజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో డిజిథాన్ బృంద సభ్యులు భాగ్యలక్ష్మి వాకిటి, హేమా మారం, దీపిక జోషి, తేజస్విని, నితిన్య హర్కరా, ప్రకాష్ పాల్గొన్నారు. ఈవెంట్‌లో పాల్గొనాలనుకునే స్టార్టప్‌లు, ఇన్నోవేటర్లు tinyurl.com/pitch2press ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చని, లేదా 8019077575 నెంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు.