calender_icon.png 23 November, 2025 | 11:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధిక్యంలో ప్రజ్ఞానంద

26-01-2025 12:30:27 AM

డ్రా చేసుకున్న గుకేశ్, అర్జున్

ఆమ్‌స్టర్‌డామ్: ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్‌(Tata Steel Chess Tournament)లో శనివారం భారత ఆటగాళ్లు డ్రాలతో సరిపెట్టారు. మాస్టర్స్ విభాగంలో గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద(Grandmaster Praggnanandhaa) చైనాకు చెందిన వెయ్ యితో, అబ్దుసత్రోవ్‌తో గుకేశ్, హరిక్రిష్ణ నెదర్లాండ్స్‌కు చెందిన జోర్డెన్ వాన్‌తో, ఫాబియానో కరూనాతో అర్జున్, మరో భారత గ్రాండ్‌మాస్టర్ లూక్ మెండోన్కా.. మాక్స్ వర్మెర్‌డమ్‌తో డ్రా చేసుకున్నారు. చాలెంజర్స్ విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ అర్జెంటీనాకు చెందిన ఫాస్టినొ ఓరో చేతిలో ఓటమి చవిచూడగా.. ఆర్.వైశాలీ మాత్రం ఇరినా బుల్మగాతో డ్రా చేసుకుంది. టోర్నీలో మరో ఏడు రౌండ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఆర్.ప్రజ్ఞానంద 4.5 పాయింట్లతో అబ్దుసత్రోవ్‌తో కలిసి తొలి స్థానంలో కొనసాగుతున్నాడు.