26-01-2025 12:23:52 AM
ఫైనల్లో సబలెంకపై విజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్
మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా మాడిసన్ కీస్ నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో కీస్ 6 2 7 తో అరీనా సబలెంకపై విజయం సాధించింది. మాడిసన్ కీస్ తన కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను అందుకోవడం విశేషం. గతంలో 2017 యూఎస్ ఓపెన్‌లో కీస్ రన్నరప్‌గా నిలిచింది. సెరెనా విలియమ్స్ (2005) తర్వాత ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో నంబర్‌వన్‌తో పాటు రెండో ర్యాంకర్‌ను ఓడించిన క్రీడాకారిణిగా కీస్ నిలిచింది. నేడు జరగనున్న పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్ జానిక్ సిన్నర్‌తో రష్యా స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్ అమీతుమీ తేల్చుకోనున్నాడు. ముఖాముఖి పోరులో జ్వెరెవ్ 4 సిన్నర్‌పై ఆధిక్యంలో ఉండడం విశేషం.