11-07-2025 12:13:54 AM
కరీంనగర్, జూలై 10 (విజయ క్రాంతి): నగరంలోని పారమిత లిటిల్ జీనియస్, పారమిత ఉన్నత పాఠశాలలో గురుపూర్ణిమ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పారమిత పాఠశాలల అదినేత డాక్టర్ ఇనుగంటి ప్రసాదరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం ఆయనను విద్యార్థులు, ఉపాద్యాయులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరె క్టర్లు అనుకర్ రావు, వినోదరావు, ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, బాలాజీ, కవిత, సమన్వయకర్తలు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.