24 August, 2026 | 11:31 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

యువ జర్నలిస్ట్ హఠాన్మరణం అత్యంత బాధాకరం

24-06-2025 02:18 PM

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  

నల్లగొండ టౌన్,(విజయక్రాంతి): యువ జర్నలిస్ట్ దత్తు రెడ్డి  హఠాన్మరణం అత్యంత బాధాకరమని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గా గత పది సంవత్సరాలు పని చేసిన సమయంలో చాలా సందర్భాల్లో ఆయనతో చర్చించడం జరిగిందని, దత్తు రెడ్డి జర్నలిస్ట్ గా చాలా అద్భుతమైన వార్తలను రాసారని ఆయన గుర్తు చేశారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న దత్తు రెడ్డి, చిన్న వయస్సులోనే గుండె పోటుకు గురై ప్రాణాలు కోల్పోవటం విషాదకరమని పేర్కొన్నారు. దత్తు రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించి,వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని గుత్తా తెలియజేశారు.