రెండు లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు పట్టివేత
29-06-2025 10:14 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో మహబూబాబాద్ రహదారిలో సర్వపురం పెట్రోల్ బంక్ వద్ద ఓమ్ని వ్యాన్ లో ఉన్న రెండు లక్షల రూపాయల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను నర్సంపేట పోలీసులు పట్టుకున్నారు. వాహనాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కమలాపురం గ్రామానికి చెందిన ముత్తినేని వీరన్న అదుపులోకి తీసుకున్నారు. మహబూబాబాద్ నుండి నర్సంపేటకు వ్యాన్లో గుట్కాలు తరలిస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు నర్సంపేట సిఐ రఘుపతి రెడ్డి(CI Raghupathi Reddy), ఎస్ఐ రవికుమార్(SI Ravikumar) అక్రమ గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ సంఘటన ద్వారా మహబూబాబాద్ కేంద్రంగా అక్రమ గుట్కా వ్యాపారం సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.






