06-01-2026 12:34:56 PM
హైదరాబాద్: తెలంగాణ విద్యాశాఖ పనితీరుపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మన ఊరు-మన బడి' పథకానికి రూ. 360 కోట్ల పెండింగ్ లో ఉన్నాయని, చిన్న చిన్న కాంట్రాక్టర్లు అప్పులు తెచ్చి పనులు చేసారని గుత్తా సుఖేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి పథకం నిధులు విడుదల చేయాల్సిఉందని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని ప్రభుత్వాన్ని కోరారు. పిల్లలు రోజు చెట్ల కింద కూర్చుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్ ఔట్ లు ఎక్కువవుతున్నాయని తెలిపారు. ఈ సంవత్సరం 3 లక్షల మందిని చేర్చుకున్నామని లెక్కలు చెబుతున్నారు.. కానీ 30 వేల మందిని కూడా చేర్చుకోలేదని తేల్చిచెప్పారు.