calender_icon.png 7 January, 2026 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అబ్దుల్ కలాం మాజీ ఓఎస్డీ పేరుతో మోసం

06-01-2026 11:46:39 AM

హైదరాబాద్: ఉద్యోగం ఇప్పిస్తానంటూ అబ్దుల్ కలామ్ మాజీ ఓఎస్ డీ( former OSD of Abdul Kalam) పేరుతో మోసం వెలుగులోకి వచ్చింది. బాధితుడు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. గ్రూప్ 1 ఉద్యోగం ఇప్పిస్తానని హైదర్ హుస్సేన్ రూ. 7 లక్షలు వసూలు చేశాడు. 2022లో గ్రూప్ వన్ ఉద్యోగం కోసం డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఢిల్లీ నేతలతో పరిచయాలున్నట్లు ఫొటోలు చూపి మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. రెండుసార్లు పరీక్షల రద్దుతో అభ్యర్థిని సయ్యద్ సమయం కోరాడు. చెల్లించిన డబ్బులను వాపస్ ఇవ్వాలని బాధితుడు కోరారు. చెక్ రూపంలో ఇవ్వాలని బాధితుడు ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరగా చంపేస్తామని బెదిరించినట్లు బాధితుడు తెలిపాడు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) దర్యాప్తు చేస్తున్నారు.