calender_icon.png 8 September, 2025 | 8:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేతిరాత.. చరిత్ర సృష్టించేలా!

08-09-2025 12:16:22 AM

  1. అక్షరాల అందం
  2. ఆలోచనలకు ప్రతిబింబం
  3. ఇంగ్లీష్ చేతివ్రాత 
  4. విద్యార్థులు సెల్ ఫోన్ లకు 
  5. సెలవు పెట్టేలా ప్రయత్నం
  6. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి వినూత్న ప్రయోగం

కరీంనగర్, సెప్టెంబర్0౭(విజయక్రాంతి); ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం లో శతాబ్దాలుగా ఎంతో విలువైనదిగా భా వించిన మన చేతివ్రాతకు దాదాపుగా దూరమవుతున్నాం. ఈ రోజుల్లో మనం రాయ డం దాదాపు మానేశాం. విద్యార్థులు సైతం రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. బా ల్యం నుండి బలపం పట్టే చేతులు సెల్ ఫో న్లకు బలవుతున్నాయి. పెన్సిల్, పెన్ పట్టే చే తులు మొబైల్, కంప్యూటర్ వాడటం వలన వ్రాయడం దాదాపు మరచిపోయేలా ఉన్నా రు.

చేతి వ్రాత వల్ల వచ్చే ప్రయోజనాలను కోల్పోతున్నారు.ప్రతిరోజు చేతితో కొన్ని పేజీ లు వ్రాయడం వల్ల వయసు మళ్లిన త ర్వాత వచ్చే మతిమరుపు వంటి వ్యాధులను నిరోధించడంతో సహా అనేక ప్రయోజనాలున్నా యని నిపుణులు చెబుతున్న మాట. వి ద్యార్థుల్లో శ్రద్ధ, క్రమశిక్షణ, సహనాన్ని చేతివ్రాత పెంపొందిస్తుంది. స్పష్టత, అర్థవంతమైన వ్య క్తికరణకు దోహదం చేస్తుంది, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు విద్యా ర్థుల్లో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వ వికాసం నింపుతుంది.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరికీ ఈ ప్రయోజనాలను చేకూర్చే ఉద్దేశం తో, చేతి వ్రాతకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి శ్రీ కారం చుట్టారు. ప్రైవేటు పాఠశాలల యజమానులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎం వోయూ లో భాగంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు టెడ్ -ఎడ్, ఒలంపియాడ్, స్పెల్ -బి వంటి పోటీ పరీక్షలతో పా టు అనేక క్రీడా పోటీల్లో శిక్షణ ఇప్పించారు.

ఈ తరహాలోనే కరీంనగర్ లోని పారమిత విద్యాసంస్థ సహకారంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేతి వ్రాత పోటీలను నిర్వహించాలని నిర్ణయించారు.ఆగస్ట్20 న ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠశాల స్థాయి చేతి వ్రాత పో టీలను నిర్వహించారు. ఇందులో నుండి ప్ర తి పాఠశాలకు ముగ్గురు విద్యార్థులను ఎం పిక చేసి 25 న మండల స్థాయిలో పోటీలు నిర్వహించారు. మండల స్థాయి పోటీదారు ల నుండి మండలానికి ముగ్గురు చొప్పున వి ద్యార్థులను ఎంపిక చేశారు.

ఈ విధంగా జి ల్లాలోని 16 మండలాల నుండి మొత్తం 584 మంది విద్యార్థులు మండల స్థాయిలో పోటీల్లో పాల్గొనగా జిల్లా స్థాయి తుది పరీక్షకు 48 మందిని ఎంపిక చేశారు. ఈనెల 7న పద్మ నగర్ లోని పారమిత హెరిటేజ్ పాఠశాలలో ఈ విద్యార్థులకు జిల్లాస్థాయి వ్రాతపరీక్ష పోటీలు జరిగాయి. 15 న కరీంనగర్ కలెక్టరేట్లో జరిగే కార్యక్రమంలో విద్యా ర్థులకు జిల్లాస్థాయి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించనున్నారు.

జిల్లాస్థాయిలో రెండు విభాగాల్లో ఇద్దరు విద్యార్థులను మొ దటి బహుమతికి ఎంపిక చేసి రూ. 5000 చొప్పున బహుమానం ఇవ్వనున్నా రు. అదేవిధంగా రెండవ బహుమతిలో ఇద్ద రు వి ద్యార్థులకు రూ.4000 చొప్పున మూ డో బ హుమతిలో ఇద్దరు విద్యార్థులకు రూ. 30 00 చొప్పున, నాలుగో బహుమతిలో ఇద్ద రు విద్యార్థులకు రూ. 2000 చొప్పున, ఐద వ బహుమతిలో ఇద్దరు విద్యార్థులకు వె య్యి రూపాయల చొప్పున అందించనున్నా రు. ప్రతి విభాగంలో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతి, మండల పాఠశాల స్థాయిలో ఎంపికైన ముగ్గురు విజేతలకు సర్టిఫికెట్లు ప్రధానం చేస్తారు.

 అధికారులకూ పరీక్ష..

 ఇంగ్లీష్ రాతలో నైపుణ్యం పెంపొందించేందుకు అధికారులు, ఉద్యోగులు, ఉపా ధ్యాయుల్లోనూ పోటీ తత్వాన్ని అలవర్చేందు కు జిల్లా స్థాయి చేతివ్రాత పోటీలలో పాల్గొనేందుకు వారికి అవకాశం ఇచ్చారు. విద్యా ర్థులతో పాటు ఉపాధ్యాయులు, అధికారు లు ఉద్యోగులు కూడా జిల్లాస్థాయి పో టీకి ఉత్సాహంగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్వి ని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫు ల్ దేశాయ్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు వ్రాత పరీక్షకు హాజరయ్యారు.

ఆనందంగా ఉంది

జిల్లా స్థాయి హ్యాండ్రైటింగ్ పోటీల్లో పాల్గొనడం నాకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఎంతో సంతోషం గా అనిపించింది. ఈ పోటీ నా చిన్ననాటి విద్యార్థి జీవనాన్ని తలపింపజే సింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులలో సృజనాత్మకతను, అక్షరాలపై మ క్కువను పెంపొందిస్తాయి. భవిష్యత్తులో మరెంతో మంది పిల్లలు ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభి వృద్ధి సాధించాలనుకుంటున్నాను.

ఎనుగు ప్రభాకర్ రావు

ఎం ఈవో గంగాధర

మొబైల్ యుగంలో గొప్ప నిర్ణయం 

--మొబైల్, కంప్యూటర్ వాడటం వలన వ్రాయడం దాదాపు మరచిపోయేలా ఉ న్నాం. ఈ సందర్భంగా కలెక్టర్ మేడం తీ సుకున్న చేతివ్నిరాత పోటీల నిర్ణయం వల్ల మళ్ళీ నేను చేతివ్రాత పై మంచిగా దృష్టి పెట్టి, బాగా సాధన చేసి మండల స్థాయిలో మొదటి ర్యాంకు సాధించా ను. జిల్లాస్థాయిలో మేడం తో పాటు నే ను పోటీలో పాల్గొన్నందుకు చాలా గర్వపడుతున్నాను.

 శ్రీనివాస్ రెడ్డి, 

ఎం ఈ ఓ సైదాపూర్