calender_icon.png 10 October, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"హ్యాపీ బర్త్ డే"

10-10-2025 12:38:40 AM

* ఎస్‌ఎస్ రాజమౌళి పూర్తి పేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి.  ఇప్పుడు ప్రపంచ సినీ యవనికపై క్రియేటివ్ డైరెక్టర్‌గా వెలుగొందుతున్నారు. 1973, అక్టోబర్ 10న పుట్టిన రాజమౌళి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు. ‘శాంతి నివాసం’ టీవీ సీరియల్‌కు తొలిసారి దర్శకత్వం వహించారు. వెండితెరకు జూ.ఎన్టీఆర్ ‘స్టూడెంట్ నెం.1’తో పరిచయమయ్యారు. ‘బాహుబలి’ రెండు భాగాలు, ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రముఖమైనవి. ఛత్రపతి, ఈగ, యమదొంగ, మగధీర.. ఈయన చిత్రాలే. ఇప్పుడాయన మహేశ్‌బాబుతో సినిమా చేస్తున్నారు. 

* ప్రముఖ హాస్య నటుడు అలీ పుట్టిన రోజు శుక్రవారమే. 1968, అక్టోబర్ 10 న రాజమండ్రిలో జన్మించిన మహమ్మ ద్ అలీ బాల నటుడిగా కెరీర్ ఆరంభిం చారు. ‘సీతాకోక చిలుక’ సినిమా ద్వారా ఆయ న ప్రసిద్ధి చెందిన అలీ ఇప్పటివరకు 11 వందలకుపైగా సినిమాల్లో నటించారు. హీరోగానూ ప్రేక్షకాదరణ పొందారు. 

* రకుల్ ప్రీత్ సింగ్ పుట్టిన తేది 1990, అక్టోబర్ 10. తెలుగు, తమి ళం, కన్నడ, హిందీ భాషా చిత్రాల్లో నటించిన రకుల్ ఢిల్లీకి చెందిన ఓ పంజాబీ కుటుంబంలో జన్మించారు. 2009లో ‘గిల్లి’ అనే కన్నడ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈమె తెలు గు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా ఓ వెలు గు వెలిగారు. తెలుగులో రకుల్ హీరోయిన్‌గా నటించినవాటిలో నాన్నకు ప్రేమతో, సరైనోడు, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, లౌక్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, కిక్2, బ్రూస్‌లీ, ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలు చెప్పుకోదగ్గవి.

* రఘుబాబు స్వస్థలం ప్రకాశం జిల్లా రావినూతల. 1964, అక్టోబర్ 10న యర్రా రఘుబాబు జన్మించారు. తెలుగు చిత్రపరిశ్రమకు సుపరిచితుడై న నటుడు గిరిబాబు కొడుకే ఈ రఘుబాబు. ఈయన హాస్యనటుడిగా, విలన్‌గా, కామెడీ విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో కొనసాగుతున్నారు.