10-10-2025 12:40:12 AM
ప్రియదర్శి హీరోగా నటిస్తున్న తాజాచిత్రం ‘ప్రేమంటే’. ఈ రిఫ్రెషింగ్ రొమాంటిక్ కామెడీ మూవీకి ‘థ్రిల్-యు ప్రాప్తిరస్తు!’ అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమాతో నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్ గా అరంగేట్రం చేస్తున్నారు. పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, జాన్వీ నారంగ్ నిర్మాతలు. ఇందు లో ఆనంది హీరోయిన్‌గా నటిస్తుండగా సుమ కనకాల ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ‘దోచావే నన్నే’ను గురువారం స్టార్ హీరో నాని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ రొమాంటిక్ గీతాన్ని అబ్బీ వీ ఆలపించగా, శ్రీమణి రాశారు. ‘రాయంచతో రాసలీల.. నడిరేయి వేళ.. ఊరంతట నిదుర గోల.. మనకి తేలవారిందిలా..’ అంటూ సాగుతున్న ఈ పాటలో ప్రియదర్శి, ఆనంది కెమిస్ట్రీ చాలా సహజంగా ఉంది.