09-10-2025 12:15:59 AM
ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యక్తిగత జీవితం. ఈ రెండు విషయాల్లో ఇటీవల సోషల్‌మీడియా లో బాగా ట్రెండ్ అవుతోంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. కొన్ని విషయాల్లో రష్మికకు ఫేవర్‌గా టాక్ నడుస్తుంటే మరికొన్ని విషయాల్లో ఆమెను విమర్శి స్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎప్పుడూ సోషల్‌మీడియా కామెంట్స్‌ను పట్టించుకోని రష్మిక ఈసారి మాత్రం ట్రోలింగ్‌పై ఘాటుగానే స్పందించింది. ‘కాంతార: చాఫ్టర్1’ చిత్రానికి ప్రేక్షకులంతా బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలిసిందే.
దీంతో నెటిజన్లు ‘మీ కన్నడ ఇండస్ట్రీ నుంచి ఒక మంచి సినిమా వస్తే కనీసం స్పందించలేవా?!’ అంటూ రష్మికను ట్యాగ్‌ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌పై విసిగిపోయిన రష్మిక సీరియస్ పోస్ట్ పెట్టింది. ‘ఏ సినిమా అయినా విడుదలైన వెంటనే నేను చూడలేను. కాంతార కూడా అంతే. ఇటీవలే సినిమా చూశా. ఆ మూవీ టీమ్‌ను అభినందిస్తూ మెసేజ్ కూడా చేశా. తెర వెనుక ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియదు.
మన వ్యక్తిగత జీవితంలోని ప్రతి విషయాన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా! అన్ని విషయాలూ ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు నేను. నాకు సంబంధించి అన్ని విషయాల్లో ప్రజలు నా గురించి ఏమనుకున్నా నేను పట్టించుకోను. నా నటన గురించి ఏమనుకుంటున్నా రన్నదే నాకు ముఖ్యం’ అని రాసుకొచ్చింది. ఇక రష్మిక ప్రస్తుతం ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘థామ్మా’ అక్టోబర్ 21న విడుదల కానుంది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. ఇంకా తెలుగులో రష్మిక నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం కూడా విడుదల కావాల్సి ఉంది.