calender_icon.png 16 November, 2025 | 7:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాగృత్ హైదరాబాద్ హైదరాబాద్

16-11-2025 12:29:13 AM

-నగర పోలీసుల డోర్- టు- డోర్ సైబర్ అవగాహన కార్యక్రమం

-ప్రజలను చైతన్యపరుస్తున్న అధికారులు

-ప్రతి శనివారం ‘సైబర్ అవేర్‌నెస్ డే’: సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): పెరిగిపోతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘జాగృత్ హైదరాబాద్ హైదరాబాద్’ నినాదంతో ప్రతి గడపకూ సైబర్ భద్రత సందేశాన్ని తీసుకెళ్లేందుకు మెగా డోర్ -టు-డోర్ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఇందులో భాగంగా, ప్రతి శనివారం సైబర్ అవేర్‌నెస్ డేగా పాటిస్తూ, నగరవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరుస్తున్నారు. ఈ నెల 9న డీజీపీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, పౌరులను సైబర్ వలంటీర్లుగా భాగస్వాములను చేసేందుకు సైబర్ సింబా ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

ఇందు లో భాగంగా శనివారం నగరంలోని అన్ని జోన్ల డీసీపీలు, ఏసీపీలు, ఎస్‌హెఓలు తమ పరిధిలోని ప్రాంతాల్లో స్వయంగా ఇంటింటికీ తిరిగారు. సైబర్ మోసాల బారిన పడ కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుమానాస్పద ఆన్‌లైన్ కార్యకలాపాలను గుర్తిం చడం, సురక్షిత డిజిటల్ పద్ధతులను అవలంబించడంపై పౌరులకు అవగాహన కల్పిం చారు. నగరంలోని 23 ప్రాంతాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో సుమారు 2,400 మంది ప్రజలు పాల్గొన్నారు.

ఈ సమావేశాల్లో 14 మంది సైబర్ క్రైమ్ బాధితులు పాల్గొని, తాము ఎలా మోసపోయా రో వివరిస్తూ తమ అనుభవాలను పంచుకున్నారు. సైబర్ సింబా లోగోతో ఏర్పాటు చేసిన సెల్ఫీ స్టాండ్ వద్ద యువత ఉత్సాహంగా ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం, సైబర్ సింబాగా చేరేందుకు 229 మంది యువకులు ఆసక్తి చూపడం విశేషం.

పోలీసుల లక్ష్యాలు..

ఈ కార్యక్రమం ద్వారా సాధారణ సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం, సురక్షిత డిజిటల్ ప్రవర్తనను ప్రోత్సహించడం, సైబర్ నేరాల నివారణలో ప్రజలను భాగస్వాములను చేయడం వంటి ల క్ష్యాలతో ముందుకు సాగుతున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్, కస్టమ ర్ కేర్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, జాబ్ ఫ్రాడ్, ఫెడెక్స్, పార్శిల్ ఫ్రాడ్, ఓటీపీ మోసాలు వంటి వివిధ రకాల నేరాలపై ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి ఇంటి తలుపు తట్టే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, సైబర్ నేరాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి హైదరాబాద్ సిటీ పోలీసుల అధికారిక సోషల్ మీడియా ఖాతాలను ఫాలో కావాలని సీపీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు