calender_icon.png 22 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇడ్లీ కడై పాటల సందడి

22-07-2025 12:25:05 AM

ఇటీవల శేఖర్ కమ్ముల ‘కుబేర’తో భారీ విజయాన్ని అందుకున్నారు తమిళ స్టార్ ధనుష్. ఆయన నుంచి ఇప్పుడు ఓ గ్రామీణ నేపథ్యంలో ఓ చిత్రం రానుంది. ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఇడ్లీ కడై’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తుండగా, నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. ‘తిరుచిత్ర బలం’ తర్వాత ధనుష్ సరసన నిత్యామీనన్ జోడీ కడుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే, ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను చిత్రబృందం త్వరలో ప్రారంభించనుంది. ఈ మేరకు తొలిపాటను విడుదల చేయనున్నట్టు టీమ్ తాజాగా ప్రకటించింది. ఈ నెల 27న ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్న విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ సోషల్‌మీడియాలో పంచుకున్న పోస్టర్ అందరిలో హుషారు నింపేలా ఉంది. ఈ సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది.