15-07-2025 01:11:20 AM
పవన్‌కల్యాణ్ హీరోగా నటించిన తాజాచిత్రం ‘హరి హర వీరమల్లు: పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. ఈ చిత్రానికి జ్యోతికృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులుగా వ్యవహరించగా పవన్‌కల్యాణ్ చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్ ప్రతినాయకుడిగా కనిపించనున్న ఈ చిత్రం లో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి కీలక పాత్రల్లో నటించారు. ఏఎం రత్నం సమర్పణలో మెగాసూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్‌రావు నిర్మిం చారు.
ఈ పీరియడ్ యాక్షన్ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఇదే 20న వైజాగ్‌లో నిర్వహించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండ గా ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
2 గంటల 42 నిమి షాల నిడివితో ఈ సినిమాకు బోర్డు యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి; సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్, పెంచల్ దాస్; కెమెరా: మనోజ్ పరమహంస, జ్ఞానశేఖర్ వీఎస్; ఎడిటర్: ప్రవీణ్ కేఎల్; ఆర్ట్: తోట తరణి.