15-07-2025 01:09:07 AM
నా స్నేహితులు రాత్రి పార్టీలకు నన్ను పిలువడం మానేశారంటూ బుంగ మూతి పెట్టుకుంది బాలీవుడ్ అందం కరీనా కపూర్. ఇందుకు గల కారణాన్నీ చెప్పుకొచ్చిందీ సైజ్ జీరో తార. ఔను, బాలీవుడ్ తారల్లో ‘సైజ్ జీరో’ ట్యాగ్ కు సరైన నిర్వచనంగా అనిపించే కరీనా కపూర్.. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా, వయసు 40 దాటినా కరీనా ఇంకా నాజూగ్గా ఉండటానికి కారణం ఆహార నియమాలేనట! కరీనా తన డైట్ గురించి చెప్తూ “10-15 రోజులు అదే పప్పన్నం, పెరుగన్నం చేసి నా వంట మనిషి విసిగిపోతా డు.
కానీ, నాకు రోజూ తిన్నా ఏమీ అనిపిం చదు. సాయంత్రం ఆరింటికి డిన్నర్.. రాత్రి 9.30కు ఠంచనుగా నిద్రకు ఉపక్రమించా ల్సిందే. దునియా నిద్రలేవక ముందే వర్కవుట్స్ పూర్తి చేసేస్తా. నా స్నేహితులు కూడా నన్ను రాత్రి పార్టీలకు పిలవడం మానేశారు. నా శరీరాకృతి చూసి, నేను ఎక్కువగా క్వినోవా తీసుకుంటానను కుంటారు కానీ కాదు” అని చెప్పు కొచ్చింది కరీనా.