calender_icon.png 6 July, 2025 | 10:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హార్వర్డ్‌కు కష్టాలు

25-05-2025 12:09:00 AM

అమెరికాలోని ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఖ్యాతి మసకబారుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెం డోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత యంత్రాంగం యూనివర్సిటీల వైపు కూడా మళ్లింది.

విదేశీ విద్యార్థులు లక్ష్యంగా ట్రంప్ అధికార యం త్రాంగం అనేక నిబంధనలు తీసుకొచ్చింది. స్వతంత్ర ప్రతిపత్తి, భావస్వేచ్ఛకు పెద్దపీట వేసే అమెరికన్ విశ్వవిద్యాలయాల్లో సైతం ట్రంప్ విధా నాలనే తమ విధానాలుగా అమలు చేయాలన్న ధోరణి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. 

యూనివర్సిటీ క్యాంపస్‌లలో విదేశీ విద్యార్థులు అమెరికా వ్యతిరేక, యూదు వ్యతిరేక, ఉగ్రవాద సంస్థలకు మద్దతునిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారనేది వైట్‌హౌజ్ చేస్తున్న తీవ్ర ఆరోపణ. విదేశీ విద్యార్థులను చేర్చుకోకూడదని గత శుక్రవారం ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్ విశ్వ విద్యాలయానికి హుకుం జారీ చేయడం ఇందులో భాగమే. ఈ ఆదేశాల ప్రభావం ఇంతాఅంతా కాదు. వీసాలు కలిగి వున్న ఏడు వేల మందిపై తక్షణం వేటు పడుతుంది.

389 ఏళ్ల చరిత్ర కలిగిన హార్వర్డ్ యూనివర్సిటీ ఇలాంటి సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడం ఒకింత ఆశ్చర్యం, వింతగా ఉందని ప్రొఫెసర్లు చెప్తున్నారు. అసలు విదేశీ విద్యార్థులు లేకుండా హా ర్వర్డ్ యూనివర్సిటీని నడపడమనేది వింతగొలిపే విషయం. యేటా హా ర్వర్డ్ యూనివర్సిటీ దాదాపు ఏడు వేల మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తుంది. ప్రస్తుత ఏడాది దాదాపు 800 మంది భారత విద్యార్థులు వర్సిటీలో చదువుతున్నారు.

ఇప్పటికీ డిగ్రీ పూర్తి చేయని విద్యార్థులు హార్వర్డ్ నుంచి వేరే యూనివర్సిటీలకు ట్రాన్స్‌ఫర్ కావాల్సి ఉంటుంది. లేకపోతే ఆ విద్యార్థులు చట్టబద్ధతను కోల్పోయో ప్రమాదం పొంచి ఉన్నది.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి యూనివర్సిటీ విదేశీ విద్యార్థులను అసలు చేర్చుకోకూడదని ట్రంప్ యంత్రాంగం ఇచ్చిన తఖీదును విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకి స్తున్నారు.

ట్రంప్ యంత్రాంగం తీసుకున్న చర్యతో అంతర్జాతీయంగా అమెరికా ప్రతిష్ఠ దిగజారుతుందని చైనా వ్యాఖ్యానించింది. హార్వర్డ్‌లో చైనా విద్యార్థులు కూడా యేటా పెద్ద సంఖ్యలో చదువుతుంటారు. గత విద్యాసంవత్సరంలో 1,203 మంది చైనా విద్యార్థులు అడ్మిషన్ పొం దారు. హార్వర్డ్‌లో డిగ్రీ చేసేందుకు అనేక ఏళ్లుగా శ్రద్ధ చూపిన విద్యార్థులు, అందుకు ఆర్థికంగా పెట్టిన పెట్టుబడి అంశాలు ఇప్పుడు వారిపై తీవ్ర ఒత్తిడి కలిగిస్తున్నాయి.

జాబ్ ఆఫర్లు, ఇంటర్నీషిప్ సంగతి అటుంచి, అసలు వీసా పరిస్థితి ఏమిటో తెలియక విదేశీ విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడింది.  భవిష్యత్తులో విదేశీ విద్యార్థులు అమెరికన్ యూని వర్సిటీల్లో చదువుకునేందుకు వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకునే పరిస్థితి తలెత్తింది. ట్రంప్ యంత్రాంగం హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థు లను చేర్చుకోకూడదన్న ఆదేశాలను ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది.

ట్రంప్ తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదని అభిప్రాయ పడింది.  వర్సిటీల పాఠ్యాంశాలు, విద్యార్థుల ‘భావజాలం’పై ట్రంప్ యం త్రాంగం నిఘా తొలగిపోతుందన్న నమ్మకం లేదు. ఈ అనిశ్చితి దూరమవుతుందన్న నమ్మకం ఇటు హార్వర్డ్ ఫ్యాకల్టీలో, విదేశీ విద్యార్థుల్లో కనిపిం చడం లేదు. గ్రాంట్‌ల రూపంలో హార్వర్డ్‌కు సమకూరే బిలియన్ల డాలర్లను ట్రంప్ యంత్రాంగం ఇదివరకే స్తంభింపజేసింది.