25-05-2025 12:06:05 AM
ప్రవక్తలెవరైనా అందరూ సమనత్వాన్నే కోరుకున్నారు. మారణహోమాలకు పాల్పడమని, అమాయకుల ప్రాణాలను బలిగొనమని ఎవరూ చెప్పలేదు. మత గ్రంథాలు హింసను ప్రోత్స హించమని ఉద్బోధ లేదు. కొందరు మత విలువలనే పేరుతో అతివాద, తీవ్రవాద సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు.
మానవ నాగరికత అభివృద్ధి పరిణామ క్రమంలో అనివార్యంగా మతాన్ని, దేవుడిని సృష్టిం చు కోవాల్సిన అవసరత నాటి మానవుడికి ఏర్పడింది. అది చరిత్రకారులు గుర్తించిన సత్యం. శాస్త్రవేత్తలు పంచభూతాల పరివర్తన క్రమంలోనే జీవం ఆవిర్భవించిందని, జీవపరిణామ క్రమంలోనే మనిషి కూడా పురుడు పోసుకున్నాడని నిర్ధారించారు. అప్పటి నుంచి ప్రపంచం మారుతూనే వ స్తున్నది. తరాలు మారుతున్నా కొద్దీ ఆధునికత నాగరికతలో భాగమవుతూ వస్తు న్నది. ప్రకృతి ధర్మాల ప్రకారం, ఆయా ప్రాంతాల్లో వాతావరణాన్ని రుతువులు పుట్టుకొచ్చాయి.
జడివానలు, హిమపాతాలు, వడగాడ్పులు ఇలా ప్రకృతి రూపాం తరాలన్నింటిని చూసి మనిషి భీతిల్లాడు. ఏవో శక్తులు తమపై ప్రకోపాన్ని చూపిస్తున్నాయనుకున్నాడు. ఆగకుండా కురుస్తున్న వర్షాన్ని చూసి అమాంతం రెండు చేతులెత్తి మొక్కాడు. వాన నిలిచిపోగానే దేవుడు తన మొర ఆలకించాడని విశ్వసించాడు. భానుడి ప్రతాపాన్ని చూసి జడుసు కున్నాడు. సాయంత్రం చల్లబడగానే తమ ను సూర్యుడు చల్లగా చూసుకుంటున్నాడని భావించాడు. అలా సూర్యుడు సూర్య భగవానుడయ్యాడు. శిలలను కొలిచాడు. వాటిని విగ్రహాలుగా మలిచాడు.
మామూ లు చేతులెత్తి నమస్కరిస్తే చాలదునుకుని, తాను సేకరించిన ఆహారంలో కొంత దేవు డి ముందు పెట్టాడు. దానికి నైవేద్యం అని పేరు పెట్టుకున్నాడు. అలా ఊరంతా కలిసి పెడితే అది పండుగ అనుకున్నాడు. అదే సమాజంలో సంస్కృతి సంప్రదాయాలను తీసుకొచ్చింది. పూజలు, ఆరాధన, అభిషేకాలు అప్పటి నుంచే ప్రారంభమయ్యా యి. నాటి మానవ సమాజం నుంచే ప్రవక్తలు పుట్టుకొచ్చారు.
అలాంటి ప్రవక్తలే క్రీస్తు అయినా, మహమ్మద్ ప్రవక్త అయి నా. వారి బోధనలు అనుసరించి విశ్వాసకులే క్రైస్తవాన్ని, ఇస్లాం మతాలని పాటి స్తూ వస్తున్నారు. ఇక భారతదేశ విషయానికొస్తే బుద్ధుడిని మహా ప్రవక్త అని చెప్పు కోవచ్చు. స్వేచ్ఛా సమానత్వాలు కోరుకున్న మహామనిషి బుద్ధుడు. ఇప్పుడు భా రత్‌లో మెజార్టీ ప్రజలు విశ్వసించే, ఆరాధించే మతం హిందూ మతం. మత మేదైనా అందరూ శాంతిమార్గంలో నడవాలనే చెప్పాయి.
ప్రవక్తలెవరైనా అంద రూ సమనత్వాన్నే కోరుకున్నారు. మారణహోమాలకు పాల్పడమని, అమాయకుల ప్రాణాలను బలిగొనమని ఎవరూ చెప్పలేదు. మత గ్రంథాలు హింసను ప్రోత్స హించమని ఉద్బోధ లేదు. కొందరు మత విలువలనే పేరుతో అతివాద, తీవ్రవాద సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు. తమలో నేర, హింసా ప్రవృత్తిని పెంచుకుంటూ, అన్యమతస్థులను మట్టుపెడుతూ పైశాచికానందం పొందుతున్నారు.
ప్రవక్తలు ఏం కోరుకున్నారంటే..
తనను శిలువ వేసినప్పటికీ క్రీస్తు హిం సిస్తున్న వ్యక్తులకి మంచి జరగాలనే కోరుకున్నాడు తప్ప, చెడు జరగాలని భావిం చలేదు. మహ్మద్ ప్రవక్త కూడా ఇస్లాం మతాన్ని విశ్వసించే వారిని ఎలా ఆప్యాయంగా పలకరించే వాడో, ఆ మతాన్ని స్వీకరించని వారిపూ కూడా కరుణ, ఆప్యాయతతో పలకరించేవాడు. ఎవరైనా వారి ఇష్టానుసారమే ఒక మతాన్ని స్వీకరిస్తారని విశ్వసించాడయన. భారతదేశంలో హిం దూ మతాన్ని ఆచరిస్తూ కూడా ఎంతోమం ది విశ్వమానవులుగా ఎదిగారు.
భిన్నత్వం లో ఏకత్వం భారతదేశంలో మతాల విషయంలోనూ ఉంది. పాకిస్తాన్‌లో స్థావ రాలు ఏర్పాటు చేసుకున్న ముష్కరులు మతాన్ని మూఢంగా విశ్వసిస్తున్నారు. మత గ్రంథాల్లోనే లేని అమానవీయ సిద్ధాంతాలను అవలంబిస్తున్నారు. దీనిలో భాగంగానే గత నెల 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గంలో 26 మంది భారతీయ పర్యాటకులను పొట్టనపెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ లైన్లలో నించోబెట్టి, వారి మతం పేరు అడిగమరీ కాల్చి చంపారు.
హిందువులనే ఉగ్రవాదులు టార్గెట్ చేశారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పర్యాటకులను కిరాతకంగా చంపేయడా న్ని ఒక్క భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఖండించింది. భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్ భూభాగంలోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. సుమా రు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది.
అయితే.. భారత్ తీసుకున్న నిర్ణయం ముష్కరుల దాడికి, ప్రతి దాడి మాత్రమే. అలాంటి ఉగ్రవాదులు బతికి ఉంటే మున్ముందు అమాయకుల వేలాది ప్రాణాలు మట్టిలో కలిసే ప్రమా దం పొంచిఉన్నది. మానవాళి మనుగడే ప్రశార్థకమయ్యే పరిస్థితి వస్తుంది. పాకిస్థాన్ ప్రజలను భారత సైన్యం టార్గెట్ చేయలేదు. కానీ, పాకిస్థాన్‌లో ఆశ్రయం పొందుతున్న ముష్కరులు మతం పేరుతో మారణహోమానికి పాల్పడుతున్నారు.
మ తాల పేరు పెట్టుకుని ఉగ్రవాదులు శాంతి ని కోరుకునే మతాలకి చెడ్డపేరు తీసుకువస్తున్నారు. మానవ మనుగడకే ప్రమాదం తీసుకొస్తున్నారు. మానవ మనుగడ ఎల్లకాలం కొనసాగాలంటే ఏ మతాన్ని విశ్వ సించే వారైన మత సామరస్యంతో మెలగాలి. అన్ని మతాలు ఒక్కటే అనే భావ నతో తోటి మనుషులతో నడచుకోవాలి. మతం పేరుతో, దేవుళ్ల పేరుతో హత్యలు చేసుకుంటే వెళితే చివరకు మానవాళి అంతానికే దారి తీస్తుంది.
విలువలుకు విరుద్ధంగా వెళ్లొద్దు..
మానవాళి మనుగడ సాధించేందుకు మతం ఉండాలే తప్ప, మతం కోసం మా నవుడు మారణహోమం చేయకూడదు. ఉన్నతమైన జీవితాన్ని, క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని గడపడానికి మతాన్ని సృ ష్టించుకున్న మానవుడు నేడు అదే మతం మత్తులో పడి అసలైన మత విలువలను మరచిపోతున్నాడు. మత విలువలకు విరుద్ధమైన మార్గంలో ప్రయాణించి మను షుల ప్రాణాలు తీస్తున్నాడు.
ఆదిమ యు గంలో క్రూర మృగాల నుంచి రక్షణ పొం దేందుకు ఆయుధాలను తయారు చేసుకున్న మానవుడు, నేడు సాటి మాన వులను హతమార్చేందుకు కొత్త ఆయుధాలు కనిపెడుతున్నాడు. మరణాయు ధాలు తయారు చేసుకోవడమంటే ఆధునిక సమాజంలో బతుకుతున్నామని చెప్పు కోవాలా, లేకుంటే రక్షణ కోసం తయారు చేస్తున్నాం.. అని చెప్పుకోవాలా అనేది లోతుగా ఆలోచించాల్సిన విషయం.
ఐక్యరాజ్య సమితి కూడా యుద్ధ ప్రాతిపదికన అన్ని దేశాల అధిపతులని ఒకే వేదికపై కూర్చోబెట్టి, ఉమ్మడి కార్యాచరణలో భాగంగా మానవ మనుగడని ప్రమాదంలో నెట్టివేసే ఉగ్రవాద సంస్థలపై ఐక్యం గా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. మళ్లీ ఏ ఒక్క ఉగ్రవాద సంస్థ కూడా ఏ మతం నుంచి పుట్టకుండా బలమైన సం స్కరణలు తీసుకురావాల్సిన అవసరత ఉన్నది.
మారణహోమం సృష్టించే రక్షణ ఆయుధాలు అవసరం లేని, సోదరభావంతో స్వేచ్ఛగా ప్రపంచ దేశాలన్నీ వాణి జ్యం చేసుకునేలా విప్లవాత్మక సంస్కరణ లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంతిమంగా మానవుడు మతం, దేవుడిని రెండో ప్రాధాన్యతగా చూస్తూ, మొదటి ప్రాధాన్యత మానవత్వానికి, మానవ మ నుగడకి ఇవ్వాల్సిన అనివార్యత ఉంది. బా ధ్యత గల ప్రతి వ్యక్తి ఈ విషయాన్ని గుర్తెరిగి..
సాటి మనుషుల పట్ల ప్రేమ ఆప్యా యత కరుణ విలువలు కలిగి ఉండాలి. అ దే అయా మత ప్రవక్తలు బోధించిన విలువలు. ఏ మతస్థులైన మత సృష్టికర్తలు, మత పెద్దలు బోధించినా ఆదే సా రాంశం. సాటి మానవుడికి ఇబ్బంది కలగకుండా శాంతియుత మార్గంలో నడవడ మే ప్రవక్తలకు, దేవుళ్లకి మనమిచ్చే నిజమైన గౌర వం. ఇదే నేటి ఆధునిక సమాజంపై ఉన్న అతి పెద్ద బాధ్యతతో కూడిన ధర్మం.. అనే విషయాన్ని ప్రతిఒక్కరూ గ్రహించాలి.
వ్యాసకర్త సెల్‌నంబర్ 95530 41549