calender_icon.png 6 December, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మనుస్మృతిని రాహుల్ గాంధీ చదివారా?

06-12-2025 12:25:33 AM

  1. ఆ గ్రంథంపై చర్చలు రాజకీయాల వల్లే వేడెక్కుతున్నాయి
  2. శ్రీస్వామి అవిముక్తేశ్వరా నంద సరస్వతి 

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ వంటి పలువురు ప్రజా ప్రతినిధులు మనుస్మృతిని విమర్శిస్తున్నప్పటికీ ఆ గ్రంథాన్ని చాలామంది అసలు చదవలేదని శ్రీ స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనుస్మృతి గురించి జరుగుతున్న చర్చలు ఎక్కువగా రాజకీయాల వల్లే వేడెక్కుతున్నాయని చెప్పారు. ‘మనుస్మృతిని విమర్శించే వాళ్లు నిజంగా దాన్ని చదివారా?’ అన్నదే మొదటి ప్రశ్న కావాలని, కానీ ఈ ప్రశ్నకు చాలా సందర్భాల్లో చదవలేదనే సమాధానమే వస్తుంద ని వ్యాఖ్యానించారు.

ఊహాగానాలు, సామాజిక ప్రచారాల ఆధారంగానే ఎక్కువ అభి ప్రాయాలు ఏర్పడుతున్నాయని అన్నారు. మనుస్మృతిని మళ్లీ మళ్లీ చదివితే అందులో నైతికత, ధర్మం, సమాజ బాధ్యతలపై ఉన్న లోతైన సందేశాలు అర్థమవుతాయని చెప్పా రు. రాహుల్ గాంధీ పవిత్ర యజ్ఞోపవీతం ధరిస్తూ మనుస్మృతిపై విమర్శలు చేయడం ద్వారా ధార్మిక నిబద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని తెలిపారు.

పవిత్ర యజ్ఞోపవీతం అనేది కేవలం ఒక దారం మాత్రమే కాదని, అది ప్రారంభ దీక్ష, కర్తవ్యబోధ, ధర్మ శాస్త్రాలపై నిలబడే బాధ్యతకు సూచిక అని వివరించారు. మనుస్మృతి వంటి శాస్త్రాలను పాటించాల్సిన కర్తవ్యాన్ని సూచించే ఈ పవిత్ర యజ్ఞోపవీతం ధరించి, వాటినే విమర్శించడం విరుద్ధమని చెప్పారు. సంప్రదా యాల్ని గౌరవించడం, వాటి విలువలను అ నుసరించడం నిజమైన ఆచరణ అని, కే వలం రూపంలో చూపించడం మాత్రం కపటత్వానికి దారి తీస్తుందని హెచ్చరించారు.