20-10-2025 12:14:21 AM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయ క్రాంతి): దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా ప్రమాదరహితంగా జరుపుకునేందుకు కామరెడ్డి జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీఆదేశాల మేరకు ప్రజలకు భద్రతా మార్గదర్శకాలు ఎస్పీ జారీ చేశారు. అగ్నిప్రమాదాలు, గాయాలు శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి బాధ్యతాయుతంగా జరుపుకోవాల్సిన అవసరాన్ని ఆయన తెలిపారు.
బాణసంచా, భద్రతా సూచనలు, సలహాలు ఇచ్చారు.దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. పటాకులు కాల్చేటప్పుడు బహిరంగ ప్రదేశాలను మాత్రమే ఎంచుకోవాలన్నారు. మండే పదార్థాలు, వాహనాలు వంటి వాటికి దూరంగా ఉండాలి. సింథటిక్ దుస్తులు కాకుండా కాటన్ దుస్తులు ధరించడం మంచిది. పిల్లలు పెద్దల పర్యవేక్షణలోనే పటాకులు కాల్చాలి.
ప్రమాదం తలెత్తిన పరిస్థితిలో ఉపయోగించేందుకు నీరు, ఇసుక లేదా అగ్నిమాపక యంత్రం సిద్ధంగా ఉంచాలన్నారు. ‘డేడ్’ క్రాకర్లను తిరిగి వెలిగించరా రాదని తెలిపారు.15-20 నిమిషాల తరువాత వాటిని నీటిలో నానబెట్టాలి. ఇళ్లలో, టెర్రస్లపై లేదా మూసివేసిన ప్రదేశాలలో పటాకులు పేల్చరాదు. అలాగే జంతువులు లేదా మనుషుల వైపు పటాకులు విసరరాదు. ఈ సూచనలు పాటించడం ద్వారా సురక్షితమైన, ఆనందదాయకమైన దీపావళి జరుపుకోవచ్చు.
దీపాలు, లైటింగ్ భద్రత
దీపావళి సందర్భంగా ఇళ్లు అలంకరించే సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలి. దీపాలు కొవ్వొత్తులను స్థిరమైన, మండని ఉపరితలాలపై ఉంచాలి. అవి కర్టెన్లు, కాగితపు అలంకరణలు, విద్యుత్ వైర్ల వంటి మండే వస్తువుల కు దూరంగా ఉండేలా చూడాలి. వెలిగించిన దీపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గమనించకుండా వదిలి పెట్టరాదు. విద్యుత్ లైటింగ్ ఉపయోగించేటప్పుడు నాణ్యత కలిగిన లైట్లు మాత్రమే వాడాలి సాకెట్లను ఓవర్లోడ్ చేయకుండా జాగ్రత్తపడాలి.
శబ్దం, పర్యావరణ పరిరక్షణ
దీపావళి వేడుకల్లో శబ్దం కాలుష్య నియంత్రణకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించిన సమయ పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వృద్ధాశ్రమాల సమీపంలో పటాకులు పేల్చరాదు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా గ్రీన్ క్రాకర్లు (పర్యావరణహిత పటాకులు) వాడటానికి ప్రజలను ప్రోత్సహిం చారు. ఈ సూచనలు పాటించడం ద్వారా ప్రతి ఒక్కరూ సురక్షితంగా, పర్యావరణహితంగా, ఆనందభరితంగా దీపావళి పండు గను జరుపుకోవచ్చు.
అత్యవసర సంప్రదింపు నంబర్లను నంబర్లనుప్రజల భద్రత కోసం అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సంప్రదించాల్సిన హెల్ప్లైన్ నంబర్లు ఇవి. పోలీస్ కంట్రోల్ రూమ్ 100 లేదా 87126 86133, ఫైర్ కంట్రోల్ రూమ్: 101,ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్: 112, అత్యవసర పరిస్థితుల్లో పై నంబర్లకు వెంటనే సమాచారం ఇవ్వడం ద్వారా త్వరితగతిన సహాయం పొందవచ్చు.
81 మందిపై కేసులు నమోదు, రూ. 85,312ల నగదు, 41 మొబైల్స్, 9 మోటార్ సైకిళ్లను స్వాధీనం
కామారెడ్డి, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జూదం (పేకాట) ఆడుతున్న వారిపై ఆదివారం వరకు పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి నగదు, మొబైల్ ఫోన్లు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.
కామారెడ్డి జిల్లాలో పేకాట ఆడిన వారిపై కామారెడ్డి జిల్లాలోసంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్పి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. గ్రామాలలో, పట్టణాలలో ఫామ్ హౌస్ లలో, ఇళ్ళల్లో, బహిరంగ ప్రదేశంలో జూదం (పేకాట) మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం.
ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 8712686133 లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు, 100 డైల్ లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.