20-10-2025 12:16:03 AM
వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో నష్టం
మహబూబాబాద్/వరంగల్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో ఆదివారం కురిసిన అకాల వర్షంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వానకాలంలో పండించిన పంట ఉత్పత్తులను విక్రయానికి తెచ్చి మార్కెట్లలో పోయగా వర్షానికి తడిసి ముద్దయ్యాయి. నర్సంపేట, కేసముద్రం మార్కెట్లలో ఆరబోసిన మక్కజొన్నలను వానకు తడవకుండా, వరదలో కొట్టుకుపోకుండా కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. మహబూబాబాద్‌లో కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.