19-12-2025 12:00:00 AM
పాపన్నపేట, డిసెంబర్ 18 : పురుగు మందు సేవించి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్త్స్ర శ్రీనివాస్ గౌడ్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీనివాస్(38) ప్రైవేటు డ్రైవర్ గా పని చేసేవాడు. కొన్ని నెలల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగి ఇంటి వద్దే ఉంటున్నాడు. కాలు విరిగిందని ఏ పని చేయలేక పోతున్నానని తరచూ ఇంట్లో బాధ పడుతుండేవాడు.
మనస్తాపం చెందిన అతను జీవితంపై విరక్తి చెంది బుధవారం ఇంట్లో నుంచి పొలం వద్దకు వెళ్లాడు. పురుగు మందు సేవించి అవస్థ పడుతుండగా స్థానికులు గమనించి చికిత్స కోసం మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి సమయంలో మృతి చెందాడు. మృతుడి భార్య ఎలీషా ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్త్స్ర పేర్కొన్నారు.