20-12-2025 12:08:21 AM
జీహెచ్‌ఎంసీ డీలిమిటేషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 19 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు పూర్తి గా మారబోతున్నాయి. విశ్వనగరాన్ని మరిం త విస్తరించి, పాలనా సౌలభ్యం కోసం 300 మున్సిపల్ వార్డులుగా డీలిమిటేషన్ బృ హత్తర ప్రక్రియకు దాదాపు లైన్ క్లియర్ అ య్యింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను పాత జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడంతో అనివార్యమైన ఈ విభజన ప్రక్రియపై ఇన్నా ళ్లూ కొనసాగిన న్యాయపరమైన ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు తాజా ఆదేశాలు.. అధికారులకు పెద్ద ఊరట లభించగా డీలిమి టేషన్ ఫైనల్ నోటిఫికేషన్ జారీకి ముహూర్తం ఖరారైంది.
హైకోర్టులో ఏం జరిగింది ?
వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదని, మ్యాపులు, జనాభా లెక్కలు బహిర్గతం చేయలేదని పేర్కొంటూ నలుగురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థా నం.. గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. కోర్టును ఆశ్రయించిన ఆ నలుగురు పిటిషనర్లకు మాత్రమే వారు కోరిన విధంగా డీలిమిటేషన్ మ్యాపులు, వార్డుల వారీగా జనాభా లెక్కలను సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
అందరికీ పబ్లిక్ డొమైన్లో పెట్టాల్సిన అవసరం లేదన్నట్లుగా పరోక్ష సంకేతాలు రావడంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులకు అతిపెద్ద అడ్డంకి తొలగిపోయినట్ల యింది. డీలిమిటేషన్ డ్రాఫ్ట్ అభ్యంతరాల స్వీకరణకు హైకోర్టు రెండు రోజుల గడువు పెంచడంతో.. గురువారం సాయంత్రం వర కు ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయాలు, జోన ల్ ఆఫీసులు, ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ కౌం టర్లలో మొత్తం 5,905 అభ్యంతరాలు, సలహాలు నమోదైనట్లు అధి కారిక వర్గాల సమాచారం.
వీటిని పరిశీలించి, పరిష్కరించే ప్రక్రియను అధికారులు యుద్ధప్రాతిపదికన పూ ర్తి చేస్తున్నా రు. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో.. జీహెచ్‌ఎంసీ అధికారులు తదుపరి అడుగు వేశారు. అభ్యంతరాల పరిశీలన పూర్తి చేసి, శనివారం, సోమవారం గానీ వార్డుల పునర్వి భజన ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అనంతరం తుది ఆమోదం కోసం ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిన వెంటనే గ్రేటర్ పరిధిలో 300 వార్డులు అధికారికంగా ఉనికిలోకి వస్తాయి.
అందరీ దృష్టి రిజర్వేషన్లపై
వార్డుల విభజన కొలిక్కి రావడంతో అందరి దృష్టి ఇప్పుడు రిజర్వేషన్లపై పడింది. ఫైనల్ నోటిఫికేషన్ రాగానే.. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఎన్నికల సంఘం అధికారులు సం యుక్తంగా వార్డుల వారీగా సామాజికవర్గాల జనాభాను లెక్కించే పనిలో పడతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్, మహిళా జనరల్ కేటగిరీల వారీగా ఏ వార్డు ఎవరికి కేటాయించాల నేది నిర్ణయిస్తారు. అత్యధిక జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు ఉంటాయి. రిజర్వేషన్ల కు సంబంధించి కూడా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసి, ప్రజల నుంచి అభ్యం తరాలు స్వీకరించి, వాటిని పరిష్కరించిన తర్వాతే తుది రిజర్వేషన్లను ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా పూర్తయితేనే ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అవుతుంది.
45 వేలకు ఒక వార్డు.. కానీ సెన్సెస్ మాటేంటి..
ప్రస్తుతం జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియలో 2011 జనాభా లెక్కలను, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వద్ద ఉన్న తాజా వర్తమాన లెక్కలను ప్రామాణికంగా తీసుకున్నా రు. ప్రతి 45 వేల జనాభాకు ఒక వార్డు 10% అటు ఇటుగా అనే పారామీటర్తో విభజన చేశారు. అయితే, వచ్చే ఏడాది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తాజా సెన్సెస్ జనాభా లెక్కలు నిర్వహించనుంది. ఈ ప్రక్రి య పూర్తయిన తర్వాత.. అంటే 2027 నాటి కి జనాభా లెక్కలు అధికారికంగా మారతా యి.
అప్పుడు మళ్లీ ఇవే 300 వార్డులను తాజా జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేయా ల్సి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం హడావిడిగా విలీనం, డీలిమిటేషన్ చేపడుతున్న తీరు చూస్తుంటే.. సెన్సెస్ పూర్తయ్యేలోపే ఎన్నికలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. అప్పటి వరకు జీహెచ్‌ఎంసీని ఒకే కార్పొరేషన్‌గా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. సెన్సెస్ తర్వాతే కార్పొరేషన్ను ముక్కలు చేస్తారా.. లేదా అలాగే ఉంచుతారా.. అన్నది 2027 తర్వాతే తేలే అవకాశం ఉంది.