calender_icon.png 20 December, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి ఇల్లూ గ్రంథాలయం కావాలి

20-12-2025 12:45:54 AM

  1. పుస్తక ప్రదర్శనలను జిల్లాలకు విస్తరిస్తాం
  2. నిర్వహణకు రూ.3 కోట్లు, పుస్తకాల కోసం కోటి మంజూరు
  3.   38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ప్రారంభంలో మంత్రి జూపల్లి కృష్ణారావు

ముషీరాబాద్, డిసెంబర్ 19 (విజయక్రాంతి): సమాజంలో మార్పు తీసుకురావ డానికి పుస్తక పఠనం ఒక శక్తివంతమైన ఆయుధమని, ప్రతి గ్రామంలోని ప్రతి ఇల్లూ ఒక గ్రంథాలయంగా మారాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పునాస మ్యాగజైన్‌ను, ప్రభాత భేరి కరపత్రాన్ని, కాలెండర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టెక్నాలజీ, సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేటి కాలంలోనూ ఏటా 15 లక్షల మంది పుస్తక ప్రదర్శనకు రావడం శుభపరిణామన్నారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ కేవలం మార్కులు, ర్యాంకుల చుట్టూనే తిరుగుతోందని, ఇది మనిషిని సంస్కరించలేక పోతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కేవలం ఉద్యోగం, సంపాదన ధోరణిలో పడి మానవ జన్మ సార్థకతను మర్చిపోతున్నాం.

పాత కాలపు సంస్కారం మళ్లీ రావాలంటే గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, పుస్తకాలు చదవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. యువత తమ తల్లిదండ్రులకు కనీసం సంతకం చేయడం, చదవ డం నేర్పించాలని, అది మనందరి బాధ్యత అని గుర్తుచేశారు. పుస్తక ప్రదర్శనలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు జూపల్లి వెల్లడించారు. ఇందుకోసం సాం స్కృతిక శాఖ ద్వారా రూ.3 కోట్లు (జిల్లాకు రూ.10 లక్షల చొప్పున) కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

అలాగే, గ్రామీణ, మండల స్థాయి గ్రంథాలయాలకు మంచి పుస్తకాలను చేరవేయడా నికి తక్షణమే రూ.కోటి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో సామాజిక చైతన్యం నింపేందుకు త్వరలోనే ‘ప్రభాత భేరి’ కార్యక్రమాన్ని ప్రారంభించను న్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రస్తావిస్తూ.. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమమే ధ్యేయమన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సీఎం రేవంత్‌రెడ్డి నేతృ త్వంలోని ప్రభుత్వం ప్రజలపై కొత్త పన్నులు వేయకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని స్పష్టం చేశారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు శాశ్వత స్థలం కేటా యించే విషయంపై ముఖ్యమంత్రితో చర్చిం చి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పుస్తకం అనే జ్ఞానదీపం సమాజంలోని అజ్ఞానాన్ని, రుగ్మతలను తొలగించి కొత్త వెలుగును ప్రసాది స్తుందని మంత్రి  జూపల్లి పేర్కొన్నారు. 

పుస్తకం.. విజ్ఞాన సముద్రాన్ని దాటించే నావ: ప్రముఖ పాత్రికేయులు రామచంద్రమూర్తి

ప్రముఖ పాత్రికేయులు కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ.. పుస్తక పఠనం అంటే కేవలం చదవడమే కాదని, అది ప్రపంచాన్ని లోతుగా అర్థం చేసుకోవడమని పేర్కొన్నా రు. హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో ఆయన ప్రసంగిస్తూ.. ముఖ్యమంత్రులు లేదా మం త్రులు ఇలాంటి విజ్ఞాన ప్రదర్శనలను ప్రా రంభించడం ఒక మంచి సంప్రదాయమన్నా రు. నేటికీ పుస్తకాన్ని భౌతికంగా స్పృశిస్తూ చదవడమే తనకు అమితమైన సంతృప్తినిస్తుందని వెల్లడించారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను వెంటబెట్టుకుని ఈ ప్రదర్శనకు రావాలన్నారు. వారికి చిన్నతనం నుంచే పుస్తకాలను పరిచయం చేయడం ద్వారా గొప్ప విజ్ఞానాన్ని అందించిన వారవుతామని సూచించారు. ఈ పది రోజుల ప్రదర్శ నలో నిత్యం మూడు నుంచి నాలుగు చొప్పు న మొత్తం 40 పుస్తకాలు ఆవిష్కృతం కావ డం విశేషమన్నారు.

హైదరాబాద్ బుక్ సొసై టీ అధ్యక్షుడు డాక్టర్ యాకూబ్ అధ్యక్షత వహించిన ఈ సభలో తెలంగాణ భాషా సాంస్కృతిక సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ శాఖ చైర్మన్ డాక్టర్ రియాజ్, తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ బారాచారి, హైదరాబాద్ బుక్ సొసైటీ ప్రధానకార్యదర్శి ఆర్ వాసు, ఉపాధ్యక్షులు బాల్రెడ్డి, బీ శోభన్ బాబు, కార్యదర్శి ఆర్ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులు కే సూరిబాబు, పీ నారాయణరెడ్డి, కోశాధికారి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పుస్తకం.. ఎప్పటికీ ఎండిపోని జ్ఞాన గంగ

ప్రొ. కోదండరాం

ప్రొఫెసర్ కోదండరాం మా ట్లాడుతూ... సోషల్ మీడియా ఇచ్చే సంతృప్తి తాత్కాలికమని, పుస్తకం ద్వారా లభించే జ్ఞానం మాత్రమే శాశ్వతమని పేర్కొన్నారు. ఒక పుస్తకాన్ని చదవడం అంటే చరిత్రలోకి ప్రయాణించడమేనని, మనం నేరు గా కలవలేని ఎంతో మంది మహానుభావులతో సంభాషించే అద్భుత అవకాశం దీనివల్ల కలుగుతుందని వివరించారు.

ఈ ప్రదర్శన ప్రాంగణానికి ప్రజాకవి అందశ్రీ పేరు పెట్టడం హర్షణీయమన్న ఆయన.. పశువులు కాసుకునే స్థాయి నుంచి కేవలం పుస్తక పఠనం ద్వారానే ఆయన గొప్ప సాహితీవేత్తగా ఎదిగారని గుర్తుచేశారు. సోషల్ మీడి యాను దప్పిక తీర్చలేని నీటి బుడగతో పోల్చిన ఆయన.. పుస్తకం ఎప్పటికీ ఎండిపోని స్వచ్ఛమైన జ్ఞాన గంగ అని అభివర్ణించారు.