calender_icon.png 20 December, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనంతారంలో కోతుల బెడదకు చెక్

19-12-2025 12:00:00 AM

మాట నిలబెట్టుకున్న చిమ్ముల గోవర్ధన్ రెడ్డి 

గుమ్మడిదల, డిసెంబర్ 18 : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి నెరవేర్చారు. అనంతారం గ్రామంలో నెలకొన్న కోతుల సమస్యను పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో గోవర్ధన్ రెడ్డి, ట్రస్ట్ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థి కొమ్ము శ్రీను తరఫున కోతుల సమస్యను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.

ఎన్నికల్లో కొమ్ము శ్రీను విజయం సాధించిన అనంతరంఆ హామీని నిలబెట్టుకున్నారు. గత రెండు రోజులుగా సీజీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోతులను పట్టించి సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారంగా నిలుస్తుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార దిశగా చూపిన కృషి పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.