calender_icon.png 8 September, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నగల కోసం నమ్మించి.. ప్రాణం తీశాడు

08-09-2025 12:08:48 AM

పురుషోత్తమాయ గూడెం మర్డర్ కేసు నిందితుడు అరెస్టు

మరిపెడ సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం గ్రామ శివారులో జరిగిన బంటు వెంకటమ్మ హత్య కేసును పోలీసులు చేదించారు. వెంకటమ్మను హత్య చేసిన సాగాల వీరన్నను అరెస్టు చేసిన అనంతరం తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్ ఆదివారం మరిపెడ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు.

డిఎస్పి కథనం ప్రకారం..ఉల్లేపల్లి గ్రామానికి చెందిన బంటు వెంకటమ్మ (55) రోజువారి కూలీలను పోగు చూసి ఎక్కడ పని ఉంటె అక్కడ కూలీ పనులు వెళ్లి వస్తుండేది. ఇందులో భాగంగా సుమారు సంవత్సరం కిందట నిందితుడు కూడా కూలి పనులకు వస్తుండడంతో మృతురాలికి పరిచయం కాగా, ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకున్నారు. వాళ్లు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవాళ్లు.

వీళ్ళ పరిచయంలో చనువుగా ఉండటం వాళ్ళు అప్పుడప్పుడు నిందితురాలు వెంకటమ్మ నుండి డబ్బులు తీసుకునేవాడు. అలా పరిచయం ఎక్కువ అయింది. వెంకటమ్మ ఎటైనా బయటికి వెళ్లాలి అనుకున్నప్పుడు నిందితుడు వీరన్న తనని బైక్ పైన తీసుకెళ్లడం, ఇంటి దగ్గర దింపడం జరిగేది.ఈ క్రమంలో నిందితుడు సాగాల వీరన్నకు ఆగస్టు 31వ తేదీన డబ్బులు అవసరం ఉన్నాయని, ఫోన్ చేసి అడగగా, తాను బంగ్లాకు వస్తున్నాను రమ్మని నిందితుడుకి చెప్పడం జరిగింది.

నిందితుడు తన ఫ్రెండు బైక్  తీసుకొని మరిపెడ బస్టాండుకు చేరుకొని ఆమెను బండిమీద ఎక్కించుకొని పాతర్లపాడు పురుషోత్తమగుడెం శివారు నేర స్థలానికి చేరుకుంటారు. నిందితుడు మద్యం సేవిస్తుండగా డబ్బులు ఇవ్వాల్సిందిగా అడగగా నా దగ్గర డబ్బులు లేవని వెంకటమ్మ చెప్పడంతో ఆగ్రహానికి లోనై అదే క్రమంలో బీరు సీసా పగలగొట్టి ఆమె తలపై దాడి చేశాడని తెలిపారు.

అనంతరం ఆమె  స్కార్పుతోనే ఆమె గొంతును బిగించి హతమార్చి పక్కనే ఉన్న నీటి గుంటలో పడేసి నగలతో పరారయ్యాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో హత్య కేసును నమోదు చేశారు సిఐ రాజ్ కుమార్ గౌడ్ బృందం చాకచక్యంగా వారం రోజుల్లో చేదించడం జరిగింది. మరిపెడ సిఐ రాజకుమార్, ఎస్త్స్ర బోలగాని సతీష్, కానిస్టేబుల్ రమేష్, స్వామి వేణు, మహేష్, రమ్య, శాంత, సందీప్ (డ్రైవర్ల)ను డిఎస్పి కృష్ణ కిషోర్ అభినందించడం జరిగింది.