calender_icon.png 27 September, 2025 | 10:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెయిల్యూర్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు

27-09-2025 01:30:23 AM

కామారెడ్డి,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ గంప గోవర్ధన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రంలో సాయంత్రం టిఆర్ఎస్ మండలస్థాయి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు 420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఏ ఒక్క హామీని నెరవేర్చ లేదన్నారు.

ఫెయిల్యూర్ సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలు కోసం టిఆర్ఎస్ ప్రజల తరఫున ఉండి పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దిన్, రాజా గౌడ్, రామచంద్రం, బాలా గౌడ్, మాజీ జెడ్పిటిసి రామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.