calender_icon.png 27 September, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల విధుల్లో బాధ్యతాయుతంగా పనిచేయాలి

27-09-2025 01:30:32 AM

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్ సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా విధులు నిబద్ధతతో పారదర్శకంగా నిర్వహించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, జెడ్పి సీఈవో పురుషోత్తంతో కలిసి ఎన్నికల విధుల్లో పాల్గొనే రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులకు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్స్, నోడల్ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ తరగతులను నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారులకు ఎలాంటి సందేహాలు కలిగినా ఎన్నికల గైడ్లైన్స్ లో అన్నింటికీ సమాధానాలు ఉన్నాయని, ఎలాంటి సందేహాలు ఉన్న మాస్టర్ ట్రైనర్ల వద్ద తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. నోటిఫికేషన్ జారీ చేసిన మరుక్షణమే ఎంపీటీసీ, జెడ్ పి టి సి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.

నామినేషన్ల స్వీకరణ నుంచి అభ్యర్థుల ప్రకటన వరకు అన్ని కార్యక్రమాలను ఎన్నికల కమిషన్ నిర్దేశించే మార్గదర్శకాలు అనుగుణంగా పనిచేయాలన్నారు. వివరాలను స్పష్టంగా ప్రకటించాలని సమయపాలన కచ్చితంగా పాటించాలని, కార్యక్రమాల నిర్వహణకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు.