20-08-2025 06:16:31 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండలంలోని నాగారం గ్రామంలో డెంగ్యూ తో ఒకరు మృతి చెందడంతో స్పందించిన హెల్త్ అధికారులు గ్రామంలో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న పలువురికి పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలో పలుచోట్ల బ్లీచింగ్, దోమల మందు పిచికారి చేశారు. ఈ సందర్భంగా హెల్త్ అధికారులు మాట్లాడుతూ గ్రామంలో ఎవరికైనా జ్వరం వచ్చినట్లు అనిపించినట్లయితే వెంటనే తమను సంప్రదించాలని వారికి తగిన చికిత్స అందించడం జరుగుతుందని అన్నారు. హెల్త్ క్యాంపులో డాక్టర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.