calender_icon.png 11 July, 2025 | 8:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూల్ బస్సు దగ్ధం

11-07-2025 12:04:40 AM

- అప్రమత్తమై పిల్లలను దించిన డ్రైవర్

- తప్పిన పెను ప్రమాదం

పటాన్‌చెరు, జూలై 10: స్కూల్ బస్సు దగ్ధమైన ఘటన గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండల శివారులో జరిగింది. పటాన్‌చెరు ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకుంటున్న విద్యార్థు ల్లో ౨౪ మందిని తీసుకెళ్లేందుకు ఉదయం 7:30 గంటలకు బస్సు డ్రైవర్ రామేశ్వరంబండలో ఇద్దరు పిల్లలను ఎక్కించుకున్నాడు. అమీన్‌పూర్ శివారు లోని కళ్యాణ్ ఎస్టేట్‌లోని ఏఎస్‌ఆర్ హోమ్స్ వద్ద మరో ముగ్గరు పిల్లలను ఎక్కించుకున్నా డు.

ఇంకా ముగ్గురు పిల్లల కోసం ఎదురు చూస్తుండగా బస్సు కింద భాగంలో కుడివైపు నుంచి పొగలు రావడాన్ని అక్కడే ఉన్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ గమనించి డ్రైవర్ నర్సిం హులుకు తెలిపాడు. అప్రమత్తమైన డ్రైవర్ ఐదుగురు పిల్లలను కిందకి దించి స్థానికుల సహాయంతో ఇసుక జల్లి, నీటితో మంటలు చల్లార్చారు. ఆ వెంటనే ఎడమ వైపు నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. పటాన్‌చెరు ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్‌లు వచ్చి మంటలను ఆర్పాయి.

మంటలు పూర్తిగా ఆరిపోయేలోపు బస్సులోని లోపల భాగం అంతా మంటలకు దగ్ధ మైంది. ఈ ఘటనలో ఎలాంటి ఎవరికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు.  ఆ బస్సులో ప్రతిరోజు 24 మంది విద్యార్థులు స్కూల్‌కి వెళ్తారు. అమీన్‌పూర్ ఎస్సై విజయరావు, పటాన్‌చెరు ఆర్టీవో విజయరావ్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు వచ్చి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ప్రమాదం జరిగిన బస్సు కొత్తదని, నెలన్నర రోజుల క్రితమే రిజిస్ట్రేషన్ అయ్యిందని ఆర్టీవో విజయరావు తెలిపారు.