calender_icon.png 28 September, 2025 | 10:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఊపిరితిత్తులను కాపాడుకుంటేనే ఆరోగ్యం

25-09-2025 12:25:56 AM

  1. కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్స్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల
  2. నేడు అంతర్జాతీయ ఊపిరితిత్తుల దినోత్సవం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ముఖ్యంగా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలని, ఊపిరితిత్తులు శరీరానికి ఆక్సిజన్ ఇచ్చే ముఖ్యమైన అవయవాలు అని కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదేళ్ల తెలిపారు. గురువారం అంతర్జాతీయ ఊపిరితిత్తుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు.

“ప్రపంచంలో సుమా రు 90% మంది కలుషితమైన గాలి ని పీలుస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యంగా చేసిన మనిషి ఆరోగ్య ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరికీ ఊపిరితిత్తుల గురిం చి అవగాహన ఉండాలి. అందుకే ఏటా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 25న అంతర్జాతీయ ఊపిరితిత్తుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ దినోత్సవాన్ని 2019 లో ప్రారంభించారు. హైదరాబాద్‌లో వా యు కాలుష్యం వల్ల అనేక మంది తీవ్రమైన ఊపిరితిత్తుల సమస్యలతో ఓపికి వస్తున్నారు.

ఫ్యాక్టరీలలో పని చేసే వారు నేరుగా కలుషితమైన గాలిని పీల్చుతున్నారు. కావున వారు పని చేస్తున్న ప్రాంతం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవస రం ఉంది. పిల్లలకు స్వచ్ఛమైన గాలి అం దడం లేదు. కాబట్టి  చిన్నారులను ఖచ్చితం గా పార్కులకు తీసుకవెళ్లాలి. ఊపిరితిత్తు లు ఆరోగ్యంగా ఉండాలంటే పొగ తాగడం మానేయాలి.

మాస్క్ ధరించాలి. రోజూ నడ క లేదా వ్యాయామం చేయాలి. మంచి ఆహా రం తీసుకోవాలి. దగ్గుతున్నప్పుడు చేతితో నోరు మూయడం లాంటి శుభ్రతా అలవాట్లు పాటించండి. ఇన్హేలర్ గురించి ఉన్న అపోహలు తొలగించి, ప్రజల్లో అవగాహన పెంచాలి. దీనికి ప్రభుత్వాలు, ఎన్జీవోలు కలిసి పని చేయాలి” అని చెప్పారు.