25-09-2025 12:29:33 AM
8 నెలల శిశువును కాపాడిన ‘లిటిల్ స్టార్స్ అండ్ షీ’ వైద్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): 8 నెలల శిశువుకు శ్వాసనాళంలో ఏర్పడిన భారీ కణితిని తొలగించి ప్రాణాలు కాపాడారు. ఇంత తక్కువ వయసున్న శిశువుకి ఇలాంటి చికిత్స చేయడం హైదరాబాద్‌లో తొలిసారి. ఇందుకు సంబంధించిన వివరాలను బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్స్ అండ్ షీ, ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ డాక్టర్ సతీష్ ఘంటా తెలిపారు.
“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమం డ్రి ప్రాంతానికి చెందిన ధనలక్ష్మి దంపతుల కుమారుడైన చిన్నారి వయసు కేవలం 8 నెలలు. ఆ బాబుకు రెండు వారాల నుంచి తీవ్రమైన దగ్గు, జలుబుతో ఊపిరి ఆడకపోవడం, వారం రోజుల నుంచి జ్వరం కూడా ఉండడంతో వైద్యులకు చూపించారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ లాంటి పరీక్షలు చేశారు. బాబుకు శ్వాసనాళంలో ఒక పెద్ద తిత్తి ఏర్పడిందని తెలిసింది.
రెండో అభిప్రాయంతో పాటు మెరుగైన చికిత్స కోసం బాబును మా దగ్గరికి తీసుకువచ్చారు. ఎడమవైపు ఊపిరితిత్తుల పైభాగంలో ఒక తిత్తి ఉందని తేల్చా రు. దాని పరిమాణం 4.5x4.3x3.2 సెంటీమీటర్లు అని తేల్చారు. ఇది శ్వాసనాళానికి అడ్డం పడుతున్నది. బాబుకు జనరల్ ఎనస్థీషియా కింద శస్త్రచికిత్స చేసి, ఆ తిత్తిని తొల గించారు. తొలగించిన తర్వాత దాని పరిమాణం మరింత పెద్దగా, అంటే 6x4x4 సెం టీమీటర్లుగా తేలింది.
అది ఎడమవైపు ప్రధా న శ్వాసనాళం నుంచి రావడమే ఇన్ని సమస్యలకు కారణమైంది. ఇలాంటి వాటిని తొల గించిడానికి సంప్రాదాయ పద్దతిలో ఓపెన్ సర్జరీ చేసి తొలగిస్తారు. అయితే మేము బాబు వయసు దృష్టిలో ఉంచుకొని ఓపెన్ సర్జరీ చేస్తే వచ్చే సవాళ్లు ఇబ్బందిగా ఉంటాయని, థొరాకోస్కోపీ ద్వారా చిన్న రంధ్రం తో తొలగించాం. ఇలాంటి పద్దతిలో చికిత్స చేయడం హైదరాబాద్‌లో మెదటిసారి కావ డం విశేషం” అని తెలిపారు.
డాక్టర్ సతీష్ ఘంటా మాట్లాడుతూ, ‘శిశువు చిన్న వయ స్సు మరియు కణితి పరిమాణం మరి యు స్థానం కారణంగా ఈ కేసు ఒక ప్రత్యేకమైన సవాలును అందించింది” అన్నారు. శస్త్రచికిత్స అనంతరం బాబును పీఐసీయూలో ఉంచి ఆక్సిజన్, ఐవీ ఫ్లూయిడ్లు, యాంటీబయాటిక్స్ ఇచ్చి కోలుకునేలా చేశా రు. నాలుగు రోజుల అనంతరం బాబు పూర్తిగా కోలుకున్నాడు. అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ 98శాతం ఉండటంతో డిశ్చార్జి చేశారు.