calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారం ధర ధగ ధగ

24-09-2025 01:28:03 AM

-ఢిల్లీలో 10 గ్రాముల ధర 1.18 లక్షలు 

-ఆల్‌టైం రికార్డ్!

హైదరాబాద్, సెప్టెంబర్ 23:  బంగారం ధరలు రోజురోజుకూ దూసుకెళ్తున్నాయి. గోల్డ్‌ధర మంగళవారం మరోసారి పెరిగి ఆల్ టైం రికార్డును సృష్టించింది. న్యూఢిల్లీలో మంగళవారం తులం (10 గ్రాములు) బంగారం ధర ఏకంగా రూ.1,18,900 పలికింది. సోమవారం రూ.1,16,000 పలికిన ధర ఒక్కరోజులోనే అమాంతం పెరగడం గమనార్హం. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి.

న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,39,600 పలికింది. డాలర్‌తో పోలిస్తే రుపాయి విలువ కనిష్ఠ స్థాయికి పడిపోవడం, అమెరికా ప్రభుత్వం హెచ్‌ఁ వీసా దరఖాస్తు ఫీజు పెంపు అంశాలన్నీ బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ధరలు అకస్మాత్తుగా పెరగడానికి ప్రధాన కారణం అనిశ్చిత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇతర పెట్టుబడి సాధనాల కంటే పసిడిపై ప్రజలకు నమ్మకం పెరగడం కారణాలని అభిప్రాయపడుతున్నారు. రానున్న నాలుగేళ్లలో తులం బంగారం ధర రూ.1.81 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు.