15-10-2025 12:28:18 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కోసమైనా, ఫిర్యాదుల కోసమైనా ప్రజలు సంప్రదించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక డయల్ 1950 హెల్ప్‌లైన్, జాతీయ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏర్పాటు చేశారు.
ఈ హెల్ప్‌లైన్ ద్వారా ప్రజలు ఓటర్ల జాబితాలో తమ పేరును సరిచూసుకోవడం, పోలింగ్ కేంద్రాల వివరాలు తెలుసు కోవడం, ఎపిక్ కార్డులకు సంబంధించిన సందేహాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు, డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు సంబంధించిన అంశాలపై నేరుగా ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. ఇప్పటివరకు ఈ హెల్పలైన్‌కు 433 కాల్స్ అం దాయని, వాటిలో 379 కాల్స్‌కు సమాధానం ఇచ్చి, అవసరమైన సమాచారాన్ని అందించినట్లు అధికారులు తెలిపారు.