calender_icon.png 29 January, 2026 | 8:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగిత్యాలలో భారీ వర్షం.. తెల్లారేసరికి నిలిచిన రాకపోకలు

30-08-2024 04:13:18 PM

తెల్లారే వరకు నిలిచిన రాకపోకలు 

అత్యవసరమైతే జేసీబీ సాయంతో  అవతలి నుండి ఇవతలి ఒడ్డుకు 

జగిత్యాల, (విజయక్రాంతి): గురువారం రాత్రి నుండి శుక్రవారం తెల్లారే వరకు భారీ వర్షం కురవడంతో వాగులు, లోతట్టు ప్రాంతాలు జలమయమై జిల్లా కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి జగిత్యాల పట్టణ గోవింద్పల్లె వాగు ఉప్పొంగింది. వాగు అవతల ఉన్న వెంకటాద్రి నగర్‌కు సంబంధాలు తెగిపో యాయి. అత్యవసరమైతే జేసీబీ సాయంతో  వాగు దాటి జగిత్యాల జిల్లా కేంద్రానికి వస్తున్నారు.500 కుటుంబాలు వాగు అవతలి వైపు నివాసం ఉంటుండగా భారీ వర్షం పడిన ప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొం టుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్నా భారీ వర్షాలు వస్తే రాకపోకలు బంద్ అవుతున్నాయని ఇప్పటికైనా వంతెన నిర్మాణం చేపట్టి రాక పోకలకు ఉన్న ఇబ్బందులను తొలగించాలని అధికారులు, ప్రజాప్రతినిదులను ప్రజలు కోరుతున్నారు.