14-10-2025 05:16:55 PM
వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, పొద్దుటూర్ గ్రామాలకు వెళ్లే రహదారిలో నిర్మించిన రైల్వే అండర్ పాస్ బ్రిడ్జ్ లో పెద్దఎత్తున నీరు నిలిచిపోవడంతో రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. విషయం తెలిసి వలిగొండ మండలం ఎంపీడీవో జలంధర్ రెడ్డి మంగళవారం రైల్వే బ్రిడ్జి వద్దకు చేరుకొని రైల్వే సిబ్బందితో సంప్రదించి నిల్వవున్న నీరు మోటార్ సహాయంతో తోడించారు. అయితే పైనుండి వరద నీరు వస్తున్నందున మొత్తం నీటిని తొలగించేందుకు రెండు రోజులు పట్టే అవకాశం ఉందని రాకపోకలకు కృషి చేస్తానని తెలియజేయగా ఆయనకు రెండు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.