calender_icon.png 19 July, 2025 | 6:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు హైదరాబాద్‌లో అతిభారీ వర్షాలు

19-07-2025 02:21:58 AM

పలు జిల్లాల్లో 4 రోజుల పాటు భారీ వానలు

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో శనివారం ఉదయం 8.30 గంటల వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ విభాగం పేర్కొం ది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రుతుపవన ద్రోణి ప్రభావం వల్ల భారీ వర్షా లు కురుస్తున్నాయని తెలిపింది. తూర్పు పశ్చిమ ద్రోణి 13 డిగ్రీల ఉత్తర అక్షాంశం ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 4.5 కి.మీ. మధ్యలో ఏర్పడిందని, ఈ ద్రోణి దక్షిణ కోస్తా తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మీదుగా కొనసాగుతోందని.. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది.

ఇక శనివారం నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక నేటి నుంచి రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.