calender_icon.png 19 July, 2025 | 5:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వమే ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి ఇవ్వాలి

19-07-2025 01:35:53 AM

  1. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం సరికాదు
  2. సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ కార్మిక సంఘం (ఈయూ) విజ్ఞప్తి

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): వాతావరణ కాలుష్యంతో పర్యావరణం దెబ్బ తినకుండా ఉండాలంటే డీజిల్, పెట్రోల్ బస్సులకు బదులుగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు తీసుకువచ్చిన ఫేమ్‌x పథకంలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే విధానాన్ని కాదని ఆర్టీసీకే నేరుగా అందించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ విజ్ఞప్తి చేసింది.

ఈ మేరకు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, ఈదురు వెంకన్న సీఎం రేవంత్‌రెడ్డికి శనివారం ఓ వినతి ప త్రం అందించారు. కాలుష్యం పేరుతో కార్పొరేట్ వ్యక్తులకు సబ్సిడీ ఇచ్చి, ఎలక్ట్రిక్ బస్సు లను తయారు చేయించడం  కార్పొరేట్ రం గాన్ని బలోపేతం చేసి, ఆర్టీసీలను నిర్వీర్యం చేయడమే అని, అలా కాకుండా ఫేమ్ పథకాన్ని ఆర్టీసీకి అందేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఆర్టీసీకి స్వంతంగా బస్సులను నిర్మించే బస్ బాడీ యూనిట్, అనుభవజ్ఞులైన కార్మిక శక్తి ఉన్నాయన్నారు. అశోక్ లే లాండ్, టాటా వంటి కంపెనీలతో భాగస్వా మ్యం వహించి ఆర్టీసీనే సొంతంగా ఎలక్ట్రిక్ బస్సులను తక్కువ ధరలో తయారు చేయగలదని తెలిపారు. దీనివల్ల ఆర్టీసీ బస్ బాడీ నిర్మాణాలకు ప్రోత్సాహం లభించడంతో పా టు నిరుద్యోగ సమస్య తీరి, సామాజిక న్యా యం జరుగుతుందన్నారు.

ఇప్పటికే 600 ఎలక్ట్రిక్ బస్సులు తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సులుగా రావడం వల్ల కొన్ని డిపోలు, గ్యారేజీలు ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పారని వారు తెలిపారు. ప్రభుత్వం మరో 2 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నందున ఆ బస్సులను నేరుగా ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.