calender_icon.png 19 July, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు

19-07-2025 01:06:56 AM

  1. మంచిర్యాల, బెల్లంపల్లిలో లేబర్ ఆఫీసర్లు
  2. సిద్దిపేట జిల్లా ములుగులో డీటీ.. 

సిద్దిపేట/మంచిర్యాల, జూలై 18 (విజయక్రాంతి): సిద్దిపేట, మంచిర్యాల జిల్లాల్లో శుక్రవారం లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక కూలికి రావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇచ్చేందుకు మంచిర్యాల అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్‌రావు.. బాధితుల వద్ద రూ.లక్ష యాభై వేలు డిమాండ్ చేశాడు. చివరకు రూ.50 వేలకు ఒప్పందం కుదిరింది.

ఆ డబ్బులను కాలేజ్ రోడ్‌లోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రామ్మోహన్ రావు ఇంటి వద్ద తీసుకుంటుండగా పట్టుకున్నారు. కూలి పని చేసుకునే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా అతడి కుటుంబానికి మంజూరైన రూ.లక్ష చెక్కును అందజేసేందుకు మృతుడి భార్య వద్ద రూ. 50 వేలు డిమాండ్ చేశారు బెల్లంపల్లి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సుకన్య. రూ.40 వేల కు ఒప్పందం కుదుర్చుకున్నారు.

బాధితురాలు ఏసీబీ అధికారులను ఆశ్రయిం చగా.. అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో ఆఫీసర్‌కు లంచమిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరికి సహకరించిన సహాయకులను సైతం అదుపులోకి తీ సుకొని విచారిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ము లుగు మండలంలోని సింగన్నగూడ గ్రామానికి చెందిన బాధితులు.. 16 గుంటల భూమి తన బంధువుల తమ పేరిట పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు డిప్యూటీ తహసిల్దార్ భవా ని రూ.2 లక్షలు లంచంగా డిమాండ్ చేసిం ది.

ఇవ్వలేని స్థితిలో బాధితులు ఉండటంతో వారి దరఖాస్తును నెలల తరబడి పెండింగ్‌లో పెట్టింది. దీంతో బాధితులు ఏసీబీ అధి కారులను ఆశ్రయించారు. బాధితుల వద్ద ఉన్న ఫోన్ రికార్డింగ్ ఆడియోని, భూమికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను, దరఖాస్తు చేసుకున్న జిరాక్స్ పత్రాలను ఏసీబీ అధికారులకు అందించారు.

ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ కేసు నమోదు చేసి శుక్రవారం ములుగు తహసీల్దార్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్‌ని స్వాధీన పరుచుకున్నారు.  పూర్తిస్థా యిలో విచారణ జరిపి తదుపరి చర్యలు వెల్లడిస్తామని డీఎస్పీ సుదర్శన్ మీడియాకు తెలిపారు.