calender_icon.png 19 July, 2025 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీహార్‌కు కాంగ్రెస్ చేసిందేమి లేదు

19-07-2025 01:03:49 AM

  1.    7200 కోట్ల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన
  2. ఆర్జేడీ, కాంగ్రెస్‌లపై భగ్గుమన్న ప్రధాని
  3. బెంగాల్‌లో 5400 కోట్ల పనులకు శ్రీకారం
  4. తృణముల్ కాంగ్రెస్ దోషులను రక్షిస్తోందని వ్యాఖ్య

పట్నా/ కోల్‌కతా, జూలై 18: భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం బీహార్‌లో రూ. 7200 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బీహార్‌లో నాలు గు కొత్త అమృత్ భారత్ రైళ్లను ప్రారంభించడంతో పాటు పాట్నా, దర్బంగాల్లో ఏర్పా టు చేసిన సాఫ్ట్‌వేర్ పార్కులను కూడా ప్రా రంభించారు. అనంతరం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌తో కలిసి మోతి హారీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు.

‘ఆర్జేడీ ప్రభుత్వం యువకులకు ఉపాధి కల్పించాలని ఏనాడూ ఆలోచించలేదు. కాంగ్రెస్, ఆర్జేడీలు పేదలను మరింత పేదవారిగా మార్చాయి. కేంద్ర రైల్వే మంత్రిగా పని చేసిన లాలూ ప్రసాద్ యాద వ్ బీహార్‌కు ఏమీ చేయలేదు. 10 సంవత్సరాల యూపీఏ పాలనలో బీహార్‌కు కేవలం రూ.2 లక్షల కోట్లు మాత్రమే కేటాయించా రు. డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత బీహార్ వేగంగా అభివృద్ధి చెందుతోంది.

ఈ పది సంవత్సరాల ఎన్డీయే కాలంలో బీహార్ అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు.. అం తకు ముందు ప్రభుత్వాలు కేటాయించిన ని ధుల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. రెండు దశాబ్దాల కిందట బీహార్ ఎదుర్కొన్న పరిస్థి తులను గురించి నేటి తరం తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల పాలనలో బీహార్ ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి హయాంలో అభివృద్ధి జాడే లేదు.

పేదలు మరింత పేదలుగా తయారయ్యారు. కానీ నితీశ్ అధి కారంలోకి వచ్చాక బీహార్‌లోని ధైర్యవంతులు అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. కాం గ్రెస్, ఆర్జేడీ కబంధహస్తాల నుంచి విముక్తి కల్పించారు. నితీశ్ ప్రభుత్వం మంచి పాలనతో నేడు సంక్షేమ పథకాలు నేరుగా బీహా ర్‌లోని పేదలకు అందుతున్నాయి’ అని పే ర్కొన్నారు.

పవిత్ర సావన్ మాసంలో మటన్ పార్టీలు నిర్వహించే నాయకులను ప్రధాని మోదీ సత్కరించారని, ఇది బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు అద్దం పడుతోందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రధాని మోదీ తీరును విమర్శించారు. 

బెంగాల్‌లో మహిళలకు రక్షణ కరువు 

కాగా బీహార్ పర్యటన అనంతరం బెంగాల్‌కు చేరుకున్న ప్రధాని మోదీ అక్కడ రూ. 5,400 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం దుర్గాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ.. ‘ బెంగాల్‌లో మహిళలకు రక్షణ కరువయ్యింది. యువ వైద్యురాలికి తృణముల్ హయాంలో ఎంతటి దారుణం జరిగిందో మీరంతా చూశారు.

తృణముల్ ప్రభుత్వం దోషులను రక్షిస్తోంది.  ఈ అత్యాచార ఘటన నుంచి దేశం ఇప్పటికీ కోలుకో కముందే  లా కాలేజీ విద్యార్థిని సాముహిక అత్యాచారం జరగడం దురదృష్టకరం. ఆ కేసులో కూడా నిందితులకు తృణముల్‌తో సంబంధాలు ఉన్నట్టు తేలింది’ అని విరుచుకుపడ్డారు.