19-07-2025 01:38:44 AM
రాయ్‌పూర్, జూలై 18: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు చైతన్య బఘేల్‌ను ఈడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఉద యం భిలాయ్‌లోని బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన అధికా రులు.. అనంతరం చైతన్యను కస్టడీలోకి తీసుకున్నారు.
సుమారు 2160 కోట్ల లిక్కర్ స్కామ్‌తో సంబంధం ఉన్న నేపథ్యంలో మనీలాండరింగ్ కేసులో ఈడీ అతడిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్ మద్యం కుంభకోణంతో రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో చైత న్య బఘేల్ పాత్ర ఉందని అభియోగాలు వచ్చాయి. దీనిపై కేసు నమోదు చేసి న ఈడీ మద్యం సిండికేట్‌కు వేల కోట్ల మేర లబ్ధి చేకూరిందని పేర్కొంది.
ఈ కేసుకు సంబంధించి గతంలో బఘేల్ నివాసంలో సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ శుక్రవారం మరోసారి తనిఖీలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే భూపేశ్ బఘేల్ నివాసంలో ఈడీ దాడులు నిర్వహించిన తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద చైతన్యను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో కొత్త ఆధారాలు అందిన తర్వాత సోదాలకు చైతన్య సహకరించడం లేదని ఆరోపిస్తూ మనీలాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 19 కింద అత న్ని అరెస్టు చేసినట్టు సమాచారం. 2019 నుంచి 2022 వరకు భూపేశ్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ హ యాంలోనే జరిగినట్టు ఈడీ ఆరోపిస్తుంది.
మంచి బహుమతి ఇచ్చారు: భూపేశ్
తన కుమారుడిని అరెస్ట్ చేయడంపై భూపేశ్ బఘేల్ ఘాటుగా స్పందించారు. రాజకీయ కక్షతోనే ఈడీ సోదాలు నిర్వహించిందని మండిపడ్డారు. మోదీ, అమిత్ షా ఇ చ్చే ఇలాంటి కానుకలు ప్రపంచంలో మరెవ్వరూ ఇవ్వలేరు అంటూ వ్యం గ్యాస్త్రాలు సంధించారు. ‘గతంలో నా పుట్టినరోజు నాడు మోదీ, అమిత్ షా కలిసి ఈడీ అధికారులను నా స లహాదారు ఇంటిపైనా, ఇద్దరు ఓఎస్డీల ఇళ్లపైనా దాడులకు పంపించా రు.
తాజాగా నా కుమారుడి పుట్టినరోజు సందర్భంగా ఈసారి నా ఇం టిపైకి ఈడీ అధికారులను పంపించా రు. చైతన్యను అరెస్ట్ చేయడం ద్వారా వాడి పుట్టినరోజుకు మంచి బహుమతి ఇచ్చినందుకు మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు’ అని ఘాటుగా విమర్శించారు.