calender_icon.png 19 July, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో మారనున్న వరంగల్ దశ

19-07-2025 01:42:06 AM

  1. ఆది నుంచి తెలంగాణ నీటిని ఏపీకి తరలించడంపైనే బీఆర్‌ఎస్ దృష్టి
  2. యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ టెండర్లు పూర్తి
  3. నేడు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి 
  4. కాజీపేట కోచ్ పనులను పర్యవేక్షిస్తాం
  5. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 18 (విజయక్రాంతి): పీవీ నరసింహరావు హయాం నుంచి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం డిమాండ్ ఉందని, అనేక పోరాటాలు కూడా జరిగాయని, అయితే బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాంత చిరకాల వాంఛను నెరవేర్చిందని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ర్ట కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పనులు ఇప్పటికే -70 శాతం వరకు పూర్తయ్యాయన్నారు. ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ఈ యూనిట్ నిర్మాణాన్ని అత్యంత వేగంగా, ప్రతిష్ఠాత్మకంగా పూర్తి చేయాలని కేంద్రం నిర్ణ యించిందన్నారు. తాను స్వయంగా ప్రతి 10--15 రోజులకు ఒకసారి పను ల పురోగతిని పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. శనివారం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో కలిసి కోచ్ ఫ్యాక్టరీ పనుల పురోగతిని పరిశీలిస్తామని పేర్కొన్నా రు.

ఇప్పటికే రూ. 521 కోట్ల బడ్జెట్ మంజూరైందని.. అదనంగా మరో రూ. 200 కోట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో రైలు ఇం జిన్లు, కోచ్‌లు, వ్యాగన్లు తయారవుతాయని వెల్లడించారు. ఇది పూర్తిస్థాయి రైల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్‌ఎంయూ)గా తయారవుతోందన్నారు.

హైద రాబాద్ తర్వాత అత్యంత ప్రముఖ నగరంగా ఉన్న వరంగల్‌కు ఇది పారిశ్రామికంగా కలసివచ్చే అంశమని తెలిపారు. కేంద్రప్రభుత్వం వచ్చే ఏడాది నుంచే కోల ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటోందని.. త్వరలో ఆర్‌ఎంయూలో ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ ద్వారా దాదాపు 3 వేల శాశ్వత, ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉ ద్యోగాలు లభించనున్నాయన్నారు. 

ఏడింటిలో వరంగల్‌కు ఒక టెక్స్‌టైల్ పార్క్..

దేశవ్యాప్తంగా మంజూరైన 7 మెగా టెక్స్‌టైల్ పార్కుల్లో ఒకదాన్ని వరంగల్‌కు తీసుకురావడంలో ప్రధాని మోదీని ఒప్పించామని కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబా ద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ వంటి ప్రాంతాలు అభివృద్ధి చెందా లన్నదే తమ దృక్పథమన్నారు. కానీ రాష్ర్ట ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకోవడం లేదన్నారు. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరంగల్‌లో ఎయిర్‌పోర్ట్ అవసరం అనే విషయాన్ని చెప్పేందుకు అనేక లేఖలు రాసినా స్పందించలేదన్నారు.

ఆనా డు కేంద్రం ముందుకొచ్చిందని.. కేంద్రమం త్రి జ్యోతిరాదిత్య సింధియా స్వయంగా ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌తో మాట్లాడారని.. అయినా బీఆర్‌ఎస్ ప్రభుత్వం విమర్శలకే పరిమితమై కనీసం స్పందించలేదన్నారు. ఇ ప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వమైనా భూసేకరణను పూర్తి చేసి, ఎయిర్‌పోర్ట్ నిర్మాణం చేప ట్టాలన్నారు. 

కేంద్రం తీర్పులు ఇవ్వదు, చర్చలకు వేదిక కల్పిస్తుంది..

నదీజలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు తలెత్తినప్పుడు కేంద్రప్రభు త్వం ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలి చి చర్చలు నిర్వహించడం మామూలేనని కిషన్‌రెడ్డి తెలిపారు. తాము కోఆపరేటివ్ ఫెడరలిజాన్ని గౌరవిస్తున్నామని.. అందుకే ఇలాంటి సమస్యల పరిష్కారానికి రెండు రా ష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం చర్చలకు ఆహ్వానించామన్నారు. బనకచర్ల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇరురాష్ట్రా ల సీఎంలను చర్చలకు పిలిచిందన్నారు. కేం ద్రం తీర్పులు ఇవ్వదు, చర్చలకు వేదిక కల్పిస్తుందన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా... ప్రతిపక్షంలోకి రాగానే మరోలా మాట్లాడుతోందన్నారు.

హైదరాబాద్ నుంచి రాజస్థాన్‌కు డైరెక్ట్ ట్రైన్..

రాజస్థాన్‌కు చెందిన చాలామంది హైదరాబాద్‌లో స్థిరపడ్డారని.. వారు రాజస్థాన్‌కు రైలు రవాణా సౌకర్యం కల్పించాలని పదేపదే విజ్ఞప్తి చేశారని.. దీన్ని పరిగణనలోకి తీసుకొని కేంద్రాన్ని ఒప్పించి హైదరాబాద్--జోధ్‌పూర్ ట్రైన్ సదుపాయం తీసుకొచ్చా మని కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం ఈ రైలును ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి గుజరాత్ కచ్ వరకు రైలు సౌకర్యం కావాలని కొంతమంది కోరుతున్నారని..

అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు పూర్తయ్యాక ఈ మార్గంలోట్రైన్ ఏర్పాటు చేసేలా కృషి చేస్తామన్నారు. ఎంఎంటీఎస్ రెండవ దశకు సంబంధించి రాష్ర్ట ప్రభుత్వం కేంద్రంతో ఎంవో యూ చేసుకుందని.. అయితే ఆ ఒప్పందానికి మాత్రం రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడలేదన్నారు. అయినా ప్రధాని నరేంద్ర మోదీ హై దరాబాద్ వచ్చి ఎంఎంటీఎస్ ఫేజ్--2 ప్రా రంభించారని తెలిపారు. యాదగిరిగుట్ట వర కు రూ.330 కోట్లతో టెండర్లు పూర్తయి ట్రై న్ విస్తరణ పనులు జరుగుతున్నాయన్నారు.