19-07-2025 02:21:07 AM
- 110 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం
- ఒకరి అరెస్టు
మేడిపల్లి, జూలై 18: కల్తీ పాలు తయారీ కేంద్రంపై ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి ఒకరిని అరెస్టు చేశారు. మేడిపల్లి పరిధిలోని పర్వతాపురం, సాయి మహదేవ్‌నగర్‌లో హైడ్రోజన్ పెరాక్సైడ్, గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్‌తో కల్తీ పాలు తయారు చేస్తున్న మురళీకృష్ణరెడ్డి ఇంటిపై మల్కాజ్గిరికి చెందిన ఎస్‌ఓటీ పోలీసులు, ఏఎస్‌ఐలు మల్లేష్, నాగేందర్ శుక్రవారం దాడి చేశారు. ఇంట్లో 110 లీటర్ల కల్తీ పాలు, 1.1 లీటర్ల హైడ్రోజన్ ఫెరాక్సైడ్, 19 గ్యాన్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. మురళీకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.